‘గోల్డెన్‌ అవర్‌‘ను మరవద్దు | Police Advice to Cyber ​​Victims: Telangana | Sakshi
Sakshi News home page

‘గోల్డెన్‌ అవర్‌‘ను మరవద్దు

Published Sun, Aug 11 2024 5:03 AM | Last Updated on Sun, Aug 11 2024 5:03 AM

Police Advice to Cyber ​​Victims: Telangana

డబ్బు పోగొట్టుకున్న గంటల వ్యవధిలో ఫిర్యాదుతో మేలు 

సైబర్‌ బాధితులకు పోలీసుల సూచన 

రూ.కోట్ల రికవరీలో ఇదే కీలకమంటున్న అధికారులు 

సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌ పోర్టల్‌ వినియోగంతో డబ్బు సురక్షితంగా వెనక్కి 

ఓ కేసులో 12 నిమిషాల్లో రూ.కోటి కాపాడిన ఖాకీలు

నాచారంలో ఉండే హర్‌‡్ష అనే వ్యక్తి ఈ ఏడాది ఏప్రిల్‌ 27న సైబర్‌ నేరగాళ్ల బెదిరింపులకు భయపడి మూడు దఫాల్లో రూ.కోటి 10 లక్షలు వారు చెప్పిన బ్యాంకు ఖాతాలకు పంపారు. తాను మోసపోయినట్టు గ్రహించిన వెంటనే సైబర్‌ క్రైం హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌ (సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోరి్టంగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం) పోర్టల్‌లో వివరాలు అప్‌డేట్‌ చేశారు. కేవలం 12 నిమిషాల వ్యవధిలోనే రూ.కోటిని హోల్డ్‌ చేశారు. పెద్దమొత్తంలో డబ్బు లు సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఆపగలిగారు.  – సాక్షి, హైదరాబాద్‌

‘‘గోల్డెన్‌ అవర్‌..’’సాధారణంగా ఈ పదం వైద్యం విషయంలో ఎక్కువగా వింటుంటాం. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటలో రోగికి అందే చికిత్స అనేది వారి ప్రాణాన్ని కాపాడడంలో కీలకం. అదే మా దిరిగా సైబర్‌నేరం జరిగిన తర్వాత కూడా వెనువెంటనే పోలీస్‌ దృష్టికి తీసుకెళ్లడం వల్ల సొమ్ము సైబర్‌ నేరగాళ్లకు చేరకుండా కాపాడవచ్చని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చెబుతున్నారు. డబ్బు పోగొ ట్టుకున్న తర్వాత వెనువెంటనే సైబర్‌ క్రైం పోలీస్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930 నంబర్‌కు సమాచారం ఇవ్వడంతో తగిన పరిష్కా రం దక్కుతుందని వారు సూచిస్తున్నారు. అదేవిధంగా సైబర్‌ క్రైం పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని చెబుతున్నారు.

కంగారు వద్దు.. 1930కు డయల్‌ చేయండి  
సైబర్‌ నేరగాళ్ల చేతిలో వివిధ రూపాల్లో మోసపోతున్న బాధితులు తమ బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు కట్‌ కాగానే ఎంతో కంగారు పడుతుంటా రు. ఈ కంగారులో వారు వెంటనే బ్యాంకులకు పరుగెత్తుతున్నారు. బ్యాంకు అధికారులు ఈ విషయం పోలీసులకు చెప్పాలనడంతో అక్కడి నుంచి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళుతున్నారు. అక్కడ పోలీస్‌ అధికారులకు సమాచారం ఇవ్వడం.. పోగోట్టుకున్న డబ్బు మొత్తాన్ని బట్టి ఆ కేసు ఎవరి పరిధిలోకి వస్తుందన్న వివరాలు సేకరించేటప్పటికే ఎంతో సమయం వృథా అవుతోంది.

సైబర్‌ నేరగాళ్లు గురి చూసి మరీ సెలవులు, వారాంతాల్లోనే ఎక్కువ కొల్లగొడుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో అయితే విషయం పోలీసుల వరకు వెళ్లేందుకు చాలా సమయం పడుతుంది. కానీ, ఇన్ని ప్రయాసలు, అనవసర కంగారు పక్కన పెట్టి.. వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయడం ఉత్తమమని సైబర్‌సెక్యూరిటీ బ్యూరో అధికారులు సూచిస్తున్నారు.

24 గంటల పాటు అందుబాటులో ఉండే సిబ్బంది.. వెనువెంటనేడబ్బును కాపాడేందుకు చర్యలు తీసుకుంటారని వారు చెబుతున్నారు. అదేవిధంగా కొన్ని సార్లు నంబర్‌ వెంట నే కలవకపోతే నేరుగా సైబర్‌ క్రైం పోర్టల్‌ https:// cybercrime.gov.in లోనూ ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేయడంతోనూ ఫలితం ఉంటుందని పేర్కొంటున్నారు.

ఈ ఏడాది మే 14న ‘మేం మహారాష్ట్ర పోలీస్‌ శాఖ నుంచి మాట్లాడుతున్నాం.. మీపై పెద్ద మనీలాండరింగ్‌ కేసు నమోదైంది. వెంటనే మేం చెప్పినట్టు డబ్బులు పంపకపోతే మీపై కేసు నమో దు చేస్తాం..’’అని సైబరాబాద్‌లోని ఓ మహిళకు సైబర్‌ నేరగాడు ఫోన్‌కాల్‌ చేసి బెదిరించాడు. భయంతో వణికిపోయిన సదరు బాధితురాలు రూ.60 లక్షలు నేరగాళ్ల ఖాతాలో జమ చేసింది. తర్వాత తాను మోసపోయినట్టు గ్రహించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1930కు కాల్‌ చేసింది. క్షణాల్లోనే స్పందించిన టీఎస్‌ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో సిబ్బంది బాధితురాలు పోగొట్టుకున్న రూ.60 లక్షలు సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కకుండా కేవలం గంట వ్యవధిలోనే కాపాడటం జరిగింది.

సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌ అంటే?
సిటిజన్‌ ఫైనాన్షియల్‌ సైబర్‌ ఫ్రాడ్‌ రిపోరి్టంగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంనే సీఎఫ్‌సీఎఫ్‌ఆర్‌ఎంఎస్‌గా చెబుతారు. ఇందులో పోలీసులు, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోల సిబ్బంది, బ్యాంకులు, ఆర్‌బీఐ, పేమెంట్‌ వాలెట్లు, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తదితర వ్యవస్థలన్నింటికీ ఒక ఉమ్మడి వేదికగా ఈ పోర్టల్‌ పనిచేస్తుంది.

1930 టోల్‌ ఫ్రీ నంబర్‌ నుంచి లేదా సైబర్‌ క్రైం పోర్టల్‌కు బాధితులు డబ్బు పోగొట్టుకున్నట్టు సమాచారం ఇవ్వ గానే ఆ సమాచారాన్ని బ్యాంకు ఖాతా వివరాలు, సమయం, ట్రాన్సాక్షన్‌ చేసి న విధానం (ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లేదా క్రెడిట్‌కార్డు లేదా డెబిట్‌కార్డు ద్వారా) ఏ ఖాతా నంబర్‌కు డబ్బులు బదిలీ చేశా>రు..? ఏ సమయంలో చేశారు..? అన్నీ నమోదు చేయగానే సంబంధిత బ్యాంకు వాళ్లకు ఆ వివరాలు వెళతాయి. వెంటనే ఆ డబ్బు అనుమానాస్పద లావాదేవీ కింద గుర్తించి డబ్బులు హోల్డ్‌ చేస్తారు.  

ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే.. అంత ఫలితం
సైబర్‌ నేరగాళ్ల బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 1930 టోల్‌ ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయాలి. లేదా సైబర్‌ క్రైం పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. వెంటనే సమాచారమివ్వడం వల్ల డబ్బులు బ్యాంకులోనే ఫ్రీజ్‌ చేయవచ్చు. దీని వల్ల బాధితులు పోగొ ట్టుకున్న డబ్బును కాపాడేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెనువెంటనే సమాచారం ఇచి్చన బాధితుల సొమ్మును చాలా వరకు టీజీసీఎస్‌బీ కాపాడింది.     – శిఖాగోయెల్,    డైరెక్టర్, టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement