
ప్రజల నిర్ణయాల మేరకే అసెంబ్లీలో తీర్మానాలు
కమాన్‌పూర్: నవ తెలంగాణ పునర్‌నిర్మాణంలో ప్రజల నిర్ణయూల మేరకే అసెంబ్లీలో తీర్మానాలు చేసినట్లు డెప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆమె ఆర్జీ-3 డివిజన్ ఓసీపీ-1 ఫేస్-2లోని భద్రకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సస్యశ్యామలం కోసం అందరూ కృషిచేయూలన్నారు. ఆమేరకు ప్రభుత్వం నిధుల కేటారుుంపూ చేపడుతుందన్నారు. ఇప్పటికే 42 అంశాలపై తీర్మానం చేసినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఆడబిడ్డల సౌభగ్యం కోసం ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు.
ప్రతిపక్ష పార్టీన్నీ తెలంగాణ పునఃనిర్మాణానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్ట మధు, రామగుండం డెప్యుటీ మేయర్ సాగంటి శంకర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కటారి రేవతిరావు, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గంట వెంకటరమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు భూక్య ఆశాకుమారి, వకులా దేవి, నాగరాజ కుమారి, రమాదేవి, చంద్రకళా, కాపురబోయిన భాస్కర్, కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా తొలిసారిగా వచ్చిన డెప్యూటీ స్పీకర్‌ను సెంటినరీకాలనీ పార్టీ కార్యాలయంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.