రైతు శిక్షణ కరపత్రాన్ని విడుదల చేస్తున్న డిప్యూటీ స్పీకర్, కలెక్టర్
మెదక్ జోన్ : దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు అడుగడుగునా అండగా ఉండి వారి అభివృద్ధికి కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కోరారు. శనివారం పట్టణంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు సమితులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణ కేంద్రాన్ని డిప్యూటీ స్పీకర్ ప్రారంభించారు అనంతరం ఆమె మాట్లాడుతూ పంటసాగు కోసం ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇవ్వడం రైతులకు ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు. రెవెన్యూ రికార్డులని ఎన్నోళ్లుగా తప్పుల తడకగా ఉన్నాయని సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో భూప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టి తప్పులను పూర్తిగా సరిచేయడం జరుగుతోందన్నారు.
రైతు శిక్షణతో సమగ్ర సమాచరాన్ని రైతు సమితులు తెలుసుకుని పల్లెలో పంటలసాగు విషయంలో రైతులకు సహాయపడాలని ఆమె కోరారు. అనంతరం జరిగిన రైతు సమితుల శిక్షణలో భాగంగా వ్యసాయ జిల్లా అధికారులు పరుశురాం రసాయన ఎరువులతో భూసారం దెబ్బతింటుందని, సేంద్రియ ఎరువులతోనే రైతుకు మంచి ఆదాయం లబిస్తోందని తెలిపారు. అనంతరం రైతు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు మాట్లాడుతూ, నాలుగురోజల పాటు కొనసాగే ఈ రైతు సమితుల శిక్షణలో రోజులు ఐదు మండలాల సమితుల మండల, గ్రామ, జిల్లా కోఆర్డినేటర్లు పాల్గొంటారని తెలిపారు. శిక్షణలో అధికారులు చెప్పే ప్రతి విషయాన్ని అవగతం చేసుకుని పల్లెలో రైతులకు వివరించాలన్నారు.
వే బ్రిడ్జి ప్రారంభం..
మార్కెట్ కమిటీ ఆవరణలో రూ.13 లక్షలతో నిర్మించిన ధర్మ కాంటను ఈ సందర్భంగా ఆమె ప్రారంభించారు. అలాగే పశువుల షెడ్డు నిర్మాణం రూ.19 లక్షలతో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ధర్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, వైస్ చైర్మెన్ రాగి అశోక్, రైతు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, జెడ్పిటీసీ లావణ్యరెడ్డి, ఉద్యానవనశాఖ అధికారి చక్రపాణి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment