'మేము ప్రజలకు జవాబుదారులం' | Deputy Speaker Padma Devender Reddy visits Medak | Sakshi
Sakshi News home page

'మేము ప్రజలకు జవాబుదారులం'

Published Sat, Dec 12 2015 4:56 PM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

Deputy Speaker Padma Devender Reddy visits Medak

మెదక్ : తాము ప్రజలకు జవాబుదారులుగా పనిచేస్తామే కానీ ప్రతిపక్షాలకు కాదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మెదక్‌కు వెళ్లిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. మెదక్ ఎమ్మెల్సీ ఏకగ్రీవం కావడంపై పలువురు అఖిలపక్ష నాయకులు ఇష్టానురీతిగా మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. కానీ ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై అధికార పార్టీకి మద్దతు పలుకుతున్నారని చెప్పారు. దీనికి నిదర్శనమే ఇటీవల జరిగిన వరంగల్ ఎన్నికలన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు తాము పనిచేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున అభివృద్ధికి కొంత ఆటంకం కలుగుతోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement