
పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా పద్మా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విపక్షాలు కూడా పద్మా దేవేందర్ రెడ్డి అభ్యర్ధిత్వానికి మద్దతు తెలపడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు స్పీకర్ మధుసూదనాచారి గురువారం అసెంబ్లీలో ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు వివిధ పార్టీల నాయకులు పద్మ దేవేందర్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. మరోవైపు తెలంగాణ శాసనసభ ఉపసభాపతిగా ఆమె బాధ్యతలు స్వీకరించారు.