ముంబై: మహారాష్ట్ర సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్.. సచివాలయంలోని మూడో అంతస్తుపై నుంచి కిందకు దూకేశారు. అయితే ఆయన దూకిన సమయంలో భవనానికి సేఫ్టీ నెట్ ఏర్పాటు చేసి ఉండటంతో వారు అందులో పడిపోయారు. పోలీసులు వెంటనే వారిని రక్షించారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు అవ్వలేదు.
పెసా చట్టం ప్రకారం ఉద్యోగ నియామకాలను వ్యతిరేకిస్తూ గత 15 రోజులుగా మహారాష్ట్రలో గిరిజన విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. ఎస్టీ కేటగిరీలో ఉన్న ధంగర్ కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ మహారాష్ట్రలో గిరిజన ప్రజాప్రతినిధులు ఆందోళనకు దిగారు.
అయినప్పటికీ ప్రభుత్వం వీరి గోడు పట్టించుకోకపోవడంతో గిరిజన ఎమ్మెల్యేలు, గిరిజన సామాజిక వర్గానికి చెందిన డిప్యూటీ స్పీకర్ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్, మరికొందరు గిరిజన ఎమ్మెల్యేలు నేరుగా నేడు మంత్రాలయ భవనం వద్దకు చేరుకుని మూడో అంతస్తు నుంచి కొన్ని డాక్యుమెంట్లను గాల్లోకి విసిరేస్తూ దూకేశారు. అయితే భవనానికి నెట్ కట్టి ఉండటంతో ఎవరికీ ఏం కాలేదు.
#WATCH | NCP leader Ajit Pawar faction MLA and deputy speaker Narhari Jhirwal jumped from the third floor of Maharashtra's Mantralaya and got stuck on the safety net. Police present at the spot. Details awaited pic.twitter.com/nYoN0E8F16
— ANI (@ANI) October 4, 2024
ఈ వ్యవహారంపై డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్తో ఇప్పటికే ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చర్చలు జరిపారు. ఈ సమస్య పరిష్కారానికి సానుకూలంగానే ఉన్నామని సీఎం చెప్పినప్పటికీ అందుకు తగ్గట్టుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో గిరిజన ప్రజాప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment