ఆస్పత్రిలో చేరిన పుదుచ్చేరి డిప్యూటీ స్పీకర్‌ | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో చేరిన పుదుచ్చేరి డిప్యూటీ స్పీకర్‌

Published Thu, Aug 24 2023 2:06 AM | Last Updated on Thu, Aug 24 2023 8:03 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: పుదుచ్చేరి డిప్యూటీ స్పీకర్‌ రాజ వేలు(64) అస్వస్థతకు లోనై ఆస్పత్రి పాలయ్యారు. ఆయన్ని చికిత్స నిమిత్తం చైన్నెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని నెటపాక్కం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి రాజ వేలు ఎన్నికై న విషయం తెలిసిందే. ఆయన బీజేపీ– ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఇంట్లో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో హుటాహుటిన చైన్నెకు తరలించారు. ఇక్కడి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement