ఏపీ డిప్యూటీ స్పీకర్గా మండలి | mandali-budda-prasad-files-nomination-for-ap-deputy-speaker | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 20 2014 6:25 PM | Last Updated on Thu, Mar 21 2024 5:16 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ స్పీకర్ పదవికి మండలి పేరును ఎంపిక చేశారు. ఆయన ఎన్నిక కావడం లాంఛనమే. మండలి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకర్గం నుంచి మరోసారి ఎన్నికయ్యారు. గతంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేరు వినిపించినా చంద్రబాబు చివరకు మండలి వైపు మొగ్గు చూపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement