mandali buddaprasad
-
ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా మండలి
-
ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా మండలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ స్పీకర్ పదవికి మండలి పేరును ఎంపిక చేశారు. ఆయన ఎన్నిక కావడం లాంఛనమే. మండలి ఎన్నికలకు ముందే కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకర్గం నుంచి మరోసారి ఎన్నికయ్యారు. గతంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. డిప్యూటీ స్పీకర్ పదవికి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పేరు వినిపించినా చంద్రబాబు చివరకు మండలి వైపు మొగ్గు చూపారు. -
‘సంకరజాతి’ ఎవరో?
ఆయన మాటలు మృధువుగా ఉంటారుు. చేతలు మాత్రం మెత్తని కత్తులను తలపిస్తాయి. శాంతికాముకుడిలా కన్పిస్తారు. నిశితంగా గమనిస్తే స్వపక్షంలోనూ, విపక్షంలోనూ ఎవరిని ఎదగనీయని సంకుచితత్వం ఆయనది. తనకు పేరు రాకుంటే అభివృద్ధి పనులను సైతం అడ్డుకుంటారు. అందరూ ఒకటేనంటారు. ఓటేయనివారిని మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తారు. ఇదీ అధికార భాషా సంఘం మాజీ చైర్మన్, అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ నైజం. పైకి త్యాగధనుడిగా కన్పించే ఆయన పదవుల కోసం పాకులాడుతారనడానికి సుదీర్ఘకాలం ఉన్న కాంగ్రెస్‌ను వీడి ఎమ్మెల్యే టికెట్ కోసం టీడీపీలో చేరి... కాంగ్రెస్‌కు ఓటేసినవారంతా ‘సంకరజాతి’ వారేనని వ్యాఖ్యానించడమే నిదర్శనం. అవకాశవాదిగా మారిన బుద్ధప్రసాద్‌ను ఓడిస్తామంటూ కాంగ్రెస్‌వాదులు పడికిలి బిగించి మరీ శపథం చేస్తున్నారు. సాక్షి, మచిలీపట్నం: రాజకీయ అవసరార్ధం ఇటీవల టీడీపీలో చేరిన బుద్ధప్రసాద్‌కు పార్టీ కేడర్ సహాయ నిరాకరణతో ఎదురీత తప్పడంలేదు. తన తండ్రి మండలి వెంకటకృష్ణారావుకు రాజకీయ వారసుడిగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన బుద్ధప్రసాద్ రాష్ట్రంలో సౌమ్యుడిగా పేరు పొందినా సొంత నియోజకవర్గంలో మాత్రం అనేక విమర్శలను మూటగట్టుకున్నారు. పేరు కోసం పాకులాట... అవనిగడ్డ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని చెప్పుకుంటున్న బుద్ధప్రసాద్ పేరు కోసమే పాకులాడతారని, తనకు ఓటేయ్యని వారు ఉండే ప్రాంతాల్లో అభివృద్ధి పనులను సైతం అడ్డుకుంటారన్న విమర్శలున్నాయి. నాగాయలంక మండలంలోని ఏటిమొగ-ఎదురుమొండి వారధి, ఉల్లిపాలెం-భవానీపురం వారధి బుద్ధప్రసాద్ తీరు వల్లే ఆగిపోయాయని ఇప్పటికీ ఆ ప్రాంత వాసులు మండిపడుతుంటారు. * కృష్ణానదిపై ఏటిమొగ-ఎదురుమొండి వద్ద రూ.45కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో వారధిని నిర్మించేందుకు 2008లో ప్రతిపాదించారు. 2009 ఎన్నికల్లో బుద్ధప్రసాద్ ఓడిపోవడానికి ఎదురుమొండి దీవుల ప్రజలే ప్రధాన కారణంగా భావించిన ఆయన ఇక్కడ వారధి నిర్మాణాన్ని అడ్డుకున్నట్టు ఆరోపణలొచ్చాయి. దివంగత ఎమ్మెల్యే అంబటి బ్రాహ్యణయ్య ఈ విషయాన్ని తన మిత్రుల వద్ద పలుమార్లు ప్రస్తావించి ఆవేదన చెందినట్టు తెలిసింది. * ఉల్లిపాలెం-భవానీపురం వారధి విషయంలోనూ బుద్ధప్రసాద్ ఇలాంటి విమర్శలనే ఎదుర్కొంటున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఇక్కడ వారధిని నిర్మించేందుకు 2009లో రూ.25కోట్లు డెల్టా ఆధునీకరణ నిధులు కేటాయించారు. 2009 ఫిబ్రవరిలో వంతెన నిర్మాణం కోసం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు బుద్ధప్రసాద్ ప్రయత్నించారు. ఈ లోగానే ఎన్నికల కోడ్ రావడంతో ఆ కార్యక్రమాన్ని విరమించుకున్నారు. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఏ రోజూ బుద్ధప్రసాద్ ఈ వారధి నిర్మాణానికి చర్యలు తీసుకోలేదు. ఆ తరువాత ఆయన రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా పనిచేసినప్పటికీ ఈ వారధిని పట్టించుకున్న పాపాన పోలేదు. తాను ఎమ్మెల్యేగా లేని సమయంలో ఆ వారధుల నిర్మాణం చేపడితే స్థానిక ఎమ్మెల్యే బ్రాహ్మణయ్యకే పేరొస్తుందని భావించిన బుద్ధప్రసాద్ దాని నిర్మాణాన్ని అడ్డుకున్నారన్న విమర్శలూ లేకపోలేదు. వాడుకుని వదిలేయడం ఆయన నైజం.. దివంగత మంత్రి మండలి వెంకట కృష్ణారావు దగ్గర నుంచి ఆయన తనయుడు బుద్ధప్రసాద్ వరకు వారి రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ దోహదపడిందన్నది తెల్సిందే. కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచిన ఆ తండ్రీ, కొడుకులు మంత్రులుగానూ పనిచేశారు. అయినా బుద్ధప్రసాద్ ప్రస్తుతం పదవి కోసం కాంగ్రెస్‌కు చేయిచ్చి సైకిలెక్కేయడంతో తీవ్ర విమర్శలు వె ల్లువెతున్నాయి. నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులను, ఆదుకున్న పార్టీని నట్టేట ముంచి బుద్ధప్రసాద్ సైకిలెక్కడంతో ఛీత్కరించుకుంటున్న అనునయులు ఆయన్ను అనుసరించడంలేదు. తాను ఉండగా పార్టీలో ఇతర నాయకులెవ్వరినీ ఎదగనీయని బుద్ధప్రసాద్ ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నారు. టీడీపీలోనూ ఆయన ఇదే నైజంతో వ్యవహరిస్తారని గతంలో ఆయనతో సన్నిహితంగా మెలిగిన నాయకులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. సంకరజాతి వ్యాఖ్యలపై విమర్శలు.. మూడురోజుల క్రితం బుద్ధప్రసాద్ కోడూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ‘కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సంకర జాతికి పుట్టినట్టే’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గతంలో కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఆయనకు వేసిన ఓటర్లంతా సంకరజాతికి పుట్టిన వారేనా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ సారి టీడీపీలోకి వెళ్లాడు, వచ్చేసారి ఏ పార్టీ మారతాడో తెలియదు. ఆయనకు ఓట్లు వేయడం ఎందుకు.తిట్లు తినడం ఎందుకు అని కొంతమంది బాహాటంగానే అంటున్నారు. బుద్ధప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఓటర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేయడంతో తెలుగు తమ్ముళ్లు సైతం కలవరపడుతున్నారు. బుద్ధప్రసాద్‌పై ఎమ్మెల్యే వర్గీయుల ఆగ్రహం.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు ఏ ఒక్క నాయకుడినీ ఎదగనీయని బుద్ధప్రసాద్ టీడీపీలోనూ నాయకులను అణగ దొక్కే పనిలో పడినట్టు కొంతమంది టీడీపీ నాయకులే విమర్శిస్తున్నారు. రెండు రోజుల క్రితం నాగాయలంకలో జరిగిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కార్యాలయంలో దివంగత ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య ఫొటో లేకపోవడం, తాజా మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ బ్యానర్ లేకపోవడం పట్ల అంబటి వ ర్గీయులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అప్పటికప్పుడు బ్రాహ్మణయ్య ఫొటోను ఏర్పాటు చేశారు. టీడీపీ కోసం శ్రమించిన బ్రాహ్యణయ్యకే ప్రాధాన్యం లేకపోతే సామాన్య కార్యకర్తలను బుద్ధప్రసాద్ ఇంకేం పట్టించుకుంటారంటూ విమర్శలు రేగుతున్నాయి. ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నామని తెలుగు తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు. -
సైకిలెక్కిన మండలి, పిన్నమనేని
‘కన్నెర్ర చేస్తే..’ అంటూ టీవీ చానళ్లపై బాబు చిందులు హైదరాబాద్: కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మండలి బుద్ధప్రసాద్, పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ అర్బన్ బ్యాంక్ చైర్మన్ పూర్ణ వీరయ్య బుధవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పసుపు కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ వారు, పాతవారు కలుపుకుని పనిచేయాలని ఈ సందర్భంగా బాబు సూచించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ, సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు గెలుచుకుంటుందని వస్తున్న సర్వే వివరాలను ప్రసారం చేసిన టీవీ చానళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఒకటి రెండు, టీవీ చానళ్లు నాకు వ్యతిరేకంగా దుష్ర్పచారం చేస్తున్నాయి. నాపై బురద చల్లుతున్నాయి. వారు అలా చేస్తే నేను కన్నెర్ర చేయాల్సి వస్తుంది. అపుడు వారు ఏమవుతారో ఆలోచించుకోవాలి’’ అన్నారు -
నరసింహన్ విశ్వరూపం
-
నరసింహన్ విశ్వరూపం
* సీఎంగా కిరణ్ గత 2 నెలల్లో తీసుకున్న నిర్ణయాల సమీక్ష * ముఖ్యమంత్రి పేషీ అధికారుల బదిలీల్లో మార్పులు * నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారితో రాజీనామా చేరుుంచేందుకూ నిర్ణయం * ఫైళ్లు సర్క్యులేట్ చేయూల్సిందిగా సీఎస్‌కు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నోట్ * అన్ని శాఖలకు మహంతి ప్రత్యేక నోట్ సాక్షి, హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి గత రెండు నెలల్లో నిబంధనలకు విరుద్ధంగా విధాన, ఆర్థికపరమైన అంశాలపై తీసుకున్న ప్రధాన నిర్ణయాలను ఆయన సమీక్షించనున్నారు. రాజీనామాకు ముందురోజు కిరణ్ తన పేషీలోని అధికారులను కీలక శాఖలకు బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేశారు. జవహర్‌రెడ్డి, శ్రీధర్‌లను ఇతర శాఖలకు గవర్నర్ బదిలీ చేశారు. నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్న వారి చేత రాజీనామా చేయించాలని కూడా నరసింహన్ నిర్ణయించారు. ఈ మేరకు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్.రమేశ్‌కుమార్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి ప్రత్యేకంగా నోట్ పంపారు. కిరణ్ నిర్ణయాలకు సంబంధించి ఏ తేదీ మొదలుకుని ఫైళ్లు పంపాలో తెలియజేయాల్సిందిగా సీఎస్ సోమవారం వివరణ కోరిన నేపథ్యంలో.. గత రెండు నెలల ఫైళ్లను గవర్నర్‌కు సర్క్యులేట్ చేయాల్సిందిగా రమేశ్‌కుమార్ ఆ నోట్లో స్పష్టం చేశారు. తొలుత తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లను మరోసారి సమీక్షించాల్సిందిగా అధికారులు ముఖ్యమంత్రికి పంపినా పట్టించుకోకుండా తొలుత తీసుకున్న నిర్ణయాలనే అమలు చేయాలని సీఎం పేర్కొన్న ఫైళ్లను కూడా సర్క్యులేట్ చేయాలని కోరారు. అధికారులకు ఇష్టం లేకున్నా బలవంతంగా సంతకాలు చేసినట్లైతే అలాంటి ఫైళ్లను కూడా పంపాలని గవర్నర్ కార్యాలయం సూచించింది. దీంతో సీఎస్ ఈ మేరకు ఫైళ్లు గవర్నర్‌కు పంపాల్సిందిగా అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ప్రత్యేక నోట్‌ను జారీ చేశారు. మరోవైపు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వివిధ శాఖలు, సంస్థల్లో భర్తీ చేసిన నామినేటెట్ పదవుల్లో కొనసాగుతున్న వారితో గవర్నర్ రాజీనామా చేయించనున్నారు. సలహాదారులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా ఎవరెవరు కొనసాగుతున్నారో జాబితాలు పంపాల్సిందిగా గవర్నర్ కార్యాలయం కోరిన విషయం ‘సాక్షి’ పాఠకులకు ముందే వెల్లడించింది. కాగా ఈ వివరాలు కూడా గవర్నర్‌కు పంపాలని సీఎస్ మంగళవారం పలు శాఖలకు ప్రత్యేక నోట్ జారీ చేశారు. సీఎంగా రాజీనామా చేయడానికి కొద్దిరోజుల ముందు కిరణ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సత్యారావును నియమించిన విషయం తెలిసిందే. అలాగే మరికొన్ని సంస్థలకు చెందిన నామినేటెడ్ పోస్టులనూ ఆయన భర్తీ చేశారు. ఇలాంటి వారందరితో రాజీనామా చేయించాలని గవర్నర్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఇలావుండగా అధికార భాషా సంఘం చైర్మన్‌గా ఉన్న మండలి బుద్ధప్రసాద్ మంగళవారం సీఎస్‌ను కలిశారు. తాను గతంలోనే రాజీనామాను ముఖ్యమంత్రికి సమర్పించానని, దాన్ని ఆమోదించాలని కోరారు. ప్రాజెక్టులకు అదనపు చెల్లింపుల ఫైళ్ల సమీక్ష పలు సాగునీటి ప్రాజెక్టుల పనులకు అదనపు చెల్లింపులు చేసేందుకు కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ ఆమోదం లేకుండానే జీవో కూడా జారీ చేశారు. ఈ ఫైలు ప్రస్తుతం సీఎస్ మహంతి వద్ద ఉంది. ఇప్పుడు ఈ ఫైలు గవర్నర్ సమీక్షకు వెళ్లనుంది. పులిచింతల ప్రాజెక్టు పనులకు అదనంగా చెల్లింపులు చేయూలని ప్రభుత్వం భావించింది. ఎంత చెల్లించాలనే విషయమై ఏర్పాటైన నిపుణుల కమిటీ రూ.70 కోట్లు మాత్రమే చెల్లించాలని సిఫారసు చేసింది. కానీ సీఎంగా చివరిరోజుల్లో రూ.115 కోట్లు ఇవ్వాల్సిందిగా పేర్కొంటూ కిరణ్ హడావుడిగా ఫైలుపై సంతకం చేశారు. ఆ మరుసటి రోజే మెమో కూడా జారీ అయింది. ఈ ఫైలు కూడా గవర్నర్‌కు సర్క్యులేట్ కానుంది. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.208 కోట్లు మొబలైజేషన్ అడ్వాన్సుగా చెల్లించడానికి చివరిరోజుల్లో సీఎం ఆమోదం తెలిపారు. అయితే దీనిపై న్యాయశాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రస్తుత సర్క్యులేషన్లో ఉన్న ఈ ఫైలును సైతం గవర్నర్ పరిశీలనకు పంపనున్నారు. భూముల కేటాయింపు ఫైళ్లు కూడా... కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా చివరిరోజుల్లో ప్రజాపాలన వదిలేసి భూముల పందేరం చేయడంపై సాక్షి కథనం ప్రచురించింది. ఈ కేటాయింపులను అధికారులు తిరస్కరించినా సీఎం ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఈ ఫైళ్లను కూడా గవర్నర్ సమీక్షించనున్నారు. విశాఖ జిల్లాలో చినగదిలి మండలం కూర్మన్నపాలెం గ్రామంలో 20 ఎకరాల అత్యంత విలువైన జాగీర్దార్ భూమిని ముగ్గురు వ్యక్తులకు కట్టపెట్టే ఫైలుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. అలాగే నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో ఎస్ఎఫ్ఆర్ రిసార్ట్స్ సంస్థకు 431 ఎకరాలను కట్టపెడుతూ వ్యవసాయ భూ పరిమితి చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆ జీవోను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి కోరినా ముఖ్యమంత్రి తిరస్కరించారు. కిరణ్‌కు రెండోసారీ చుక్కెదురు! తన స్నేహితుడైన రఘురామిరెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇప్పించుకోవాలని కిరణ్ సీఎంగా రెండోసారి చేసిన ప్రయత్నానికీ నరసింహన్ గండికొట్టారు. కె.సత్యనారాయణరాజు, నంది ఎల్లయ్య, రత్నబాయి, రఘురామిరెడ్డిల పేర్లను కిరణ్ సిఫారసు చేశారు. అరుుతే గవర్నర్ తొలి మూడు పేర్లను మాత్రమే ఆమోదిస్తూ రఘురామిరెడ్డి పేరు తిరస్కరిస్తూ ఫైలు పంపారు. దీంతో కిరణ్ రెండోసారి ప్రభుత్వం సిఫారసు చేసిన నాలుగు పేర్లను ఆమోదించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ రాశారు. సంబంధిత ఫైలును మరోసారి నరసింహన్‌కు పంపారు. అయితే గవర్నర్ రెండోసారి కూడా తొలి మూడు పేర్లకే ఆమోదం తెలుపుతూ ఫైలును వెనక్కు పంపారు. దీంతో సాధారణ పరిపాలన శాఖ ఆ ముగ్గురినీ గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీలుగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. -
బాల సాహితికి బంధువు బి.వి.నరసింహారావు
స్మృతిపథం: ఆబాలగోపాలం అలవోకగా ఆస్వాదించడానికి అనువైన బాలసాహిత్యం తయారు చేయడమేగాక, ఆకర్షణీయ పద్ధతిలో ఆడి పాడి ప్రచారం చేయడం, బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం బి.వి.నరసింహారావు జీవిత ధ్యేయంగా పెట్టుకున్నారు. ‘‘నా కొలిచే దేవుళ్ళు పసివాళ్ళు గుండెగుడిని నిండుగ కొలు వుండిన దేవుళ్ళు పసివాళ్ళు’’ అని తెలుగు బాలల వినోద, విజ్ఞాన, వికాసాలకు తన జీవితాన్ని అంకితం చేసి ‘‘బాలబంధు’’గ తెలుగు నాట గణుతికెక్కారు బి.వి. నరసింహారావు. ‘‘అల్లారుముద్దు పిల్లల్లారా! ఇల్లారండి భయపడకండి ఇదిగో నాహృది! మీ విడిది! ఇట దొరుకుతుంది మీకు వలసింది’’ అని పిల్లల్లో పిల్లవాడై తన ఆటతో, పాటతో, మాటతో వారిని తన్మయులను చేసేవాడు. బి.వి. నరసింహారావు. వందల సంఖ్యలో బాలగేయాలు రాశారు. కథలూ, నాటికలు, గేయ నాటికలు, బాల సాహిత్యంపై అనేక వ్యాసాలు రాశారు. బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు-హరిశ్చంధ్ర, విరిసినపూలు, నా కథలు, ప్రియదర్శి, బాలతనం, చిన్నారిలోకం, పూలబాలలు, ఋతువాణి వంటి 17 పుస్తకాలు ప్రచురించారు. ఇందులో ‘పాలబడి పాటలు’ 1958లో జాతీయ బహుమతి పొందింది. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ ‘బాలబంధు’ బిరుదాన్ని వారికి ప్రసాదించింది. బాలవాంగ్మయ రచనా వ్యాసంగాన్ని ఆయన నిర్దిష్ట లక్ష్యసాధనకు చేపట్టారు. అవి... చిన్న పిల్లలకు విద్యామార్గాలు, జ్ఞానాంశాలు సులువుగా, సుందరంగా బోధించడం; బాలల్లో నిక్షిప్తమై ఉన్న విశిష్ట లక్షణాలను వివరించి చెప్పడం; కాలం తీరిన పెద్దలకూ, కాలం తీరాన ఉన్న పిన్నలకూ మధ్యనున్న అఖాతాన్ని, అగాథాన్ని అవగాహన అనే పూలవంతెన నిర్మాణం ద్వారా తొలగించడం; పిల్లలను నూతన దృక్కోణంతో, హేతువాద దృష్టితో అర్థం చేసుకొని వారి ఎదుగుదలకు పాటు పడవలసిందిగా పెద్దలకు విన్నవించడం; ముఖ్యంగా ఆబాలగోపాలం అలవోకగా ఆనందంగా అందుకోవడానికి, ఆస్వాదించడానికి అనువైన బాలసాహిత్యం తయారు చేయడమేగాక, ఆకర్షణీయ పద్ధతిలో ఆడి పాడి ప్రచారం చేయడం. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా బి.వి.నరసింహారావు పెట్టుకున్నారు. నేటి బాల సాహిత్యకారులు బాలబంధు బాటలో నడవాలి. ‘బాలల భావాలు బాలభాషలో వెలార్చడానికి ముందు బాల మనస్కత మనలో పుష్కలంగా ఉండాలి’ అంటారు బాలబంధు. తదనుగుణంగానే తన జీవిత విధానాన్ని ఆయన తీర్చిదిద్దుకున్నారు. 1913 ఆగస్టు 15న కృష్ణాజిల్లా కౌతారం గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన బాడిగ వేంకటనరసింహారావు జీవితం కొత్త పుంతలు తొక్కింది. కాకినాడలో ఆంధ్ర సేవా సంఘం పిల్లలతో నాటకాల్లో వేషాలు వేయించి, చదువు చెప్పిస్తారని విని, చిన్ననాటి నుంచి నటనాభిలాష ఉన్న నరసింహారావు అందులో చేరారు. కస్తూరి శివరావు. రేలంగి వెంకట్రామయ్య ఆయనకు అక్కడ సహాధ్యాయులు. ఆ పాఠశాలలో తెలుగు పండితులు వింజమూరి లక్ష్మీ నరసింహారావు బి.వి. జీవిత గమనాన్ని మార్చివేశారు. వింజమూరి రచించిన ‘అనార్కలి’ నాటకంలో అనార్కలి పాత్రధారణ బి.వి.తో వేయించారు. తన గానంతో, అభినయంతో, నాట్యంతో ఆయన ప్రేక్షకులను మైమరిపించారు. ఆనాటి నుంచి ‘అనార్కలి నరసింహారావు’గా పేరొందారు. దాదాపు పదేళ్ళపాటు అనార్కలి పాత్రలో ప్రజలను రంజింపచేశారు. ఆ రోజుల్లో స్థానం నరసింహారావు, బి.వి. నరసింహారావు స్త్రీ పాత్రలతో ప్రసిద్ధులయ్యారు. పత్రికా సంపాదకులు నార్ల వెంకటేశ్వరరావు సూచన మేరకు దాదాపు 30 ఏళ్లపాటు నాట్యరంగానికి బి.వి. విశేషసేవ చేశారు. జానపదాలకు నాట్యాభినయం కూర్చి దాన్ని శాస్త్ర,కళాసాంప్రదాయంగా రూపొందించిన ఘనత బి.వి. దక్కించుకున్నారు. ఆధునిక కవిత్వంలో భాగంగా, భావకవిత్వం కొత్త వస్తువుతో కొత్త రూపంలో ఆవిర్భవించిన సమయంలో, ఆ కొత్త పాటల ప్రాతిపదికన కొత్త నాట్యం ఆవిర్భావానికి బి.వి. కారకులయ్యారు. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, నండూరి, కొనకళ్ల వంటి మహాకవుల గీతాలకు నాట్యాన్ని కూర్చిన ఘనత బి.వి.కే దక్కింది. ‘ఏ కళనైనా చక్కగా ఆస్వాదించాలంటే దాన్ని గురించిన వివేచన వుుందు కొంతైనా అవసరం, అందుకోసం నేను, నా ప్రతి నాట్యాన్ని వివరించడానికి పండితులను ఏర్పాటు చేసుకున్నాను’ అని బి.వి. తన ఆత్మకథలో పేర్కొన్నారు. అలా నాట్య వివరణ అందించినవారిలో కృష్ణశాస్త్రి, విశ్వనాథ, అడవి బాపిరాజు, కాళోజీ, ఇంద్రగంటి, వేదుల వంటి వారెందరో ఉన్నారు.1942లో పాలకొల్లులో బి.వి. నాట్యాన్ని తిలకించిన ఆదిభట్ల నారాయణ దాసు మనసు పులకించి అమాంతంగా రంగస్థలం మీదికి దుమికి ‘ఒరే! నా ఒళ్ళు మొగ్గతొడిగిందిరా నీ నాట్య దర్శనంతో’ అంటూ ఆశువుగా పద్యం చెప్పి ఆశీర్వదించారు. కవిసామ్రాట్ విశ్వనాథ బి.వి. నాట్యానికి ‘భావనాట్యం’ అని పేరుపెట్టారు. బి.వి.నరసింహారావుకి మహారచయిత చలంగారితో ఆత్మీయానుబంధం ఉండేది. తనకు చలం రాసిన లేఖలను పుస్తకంగా వెలువరించారు. 1994 జనవరి 6వ తేదీన విజయవాడ పుస్తక ప్రదర్శనలో చలం శతజయంతి సభలో ప్రసంగిస్తూ గుండెపోటుకు గురై బి.వి. హఠాన్మరణం చెందారు. అపురూప బాలసాహితీవేత్తగా, తెలుగునాట్యానికి నూతనత్వాన్ని సంతరింపచేసిన నాట్య కళాకారుడుగా చరిత్రకెక్కిన బాలబంధు బి.వి. నరసింహారావు చిరంజీవి.