ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలి | can believe on government hospitals | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలి

Published Sat, Dec 13 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలి

ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలి

మెదక్ మున్సిపాలిటీ: వైద్యులు నిస్వార్థంగా పని చేయకుంటే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్ని సౌకర్యాలు కల్పించినా ప్రయోజనం శూన్యమని డిప్యూటీ స్పీకర్, స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఏరియా ఆస్పత్రిని ఆమె తనిఖీ చేశారు. అనంతరం డిప్యూటీ స్పీకర్ కలెక్టర్ రాహుల్ బొజ్జాతో కలిసి స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఆస్పత్రి వై ద్యులు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీల్లో  ఉన్న సమస్యలతో పాటు వైద్యుల పని తీరుపై చర్చించారు. ప్రభుత్వ ఆస్పత్రులపై   రోగులకు నమ్మకం కలిగించాల్సిన బాధ్యత వైద్యులదేనన్నారు.

చాలా చోట్ల వైద్యులు మొక్కుబడిగా పని చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. రామాయం పేట పీహెచ్‌సీ పని తీరు రోజు రోజుకు అధ్వానంగా మారుతోందన్నారు. ఇక్కడ పని చేస్తున్న వైద్యులను వెంటనే బదిలీ చేయాలని అక్కడే ఉన్న డీఎంహెచ్‌ఓకు సూచించారు. వైద్యులు  పని తీరు మెరు గు పరుచుకోవాలని లేనిపక్షంలో చర్య లు తప్పవన్నారు. పలు పీహెచ్‌సీల్లో ఓపీ రోగులను చూడకపోయినప్పటికీ ఎక్కువ  సంఖ్యలో వస్తున్నట్లు నమోదు చేస్తున్నారని, ఇలాంటి చర్యలను  మానుకోవాలన్నారు. మెదక్ ఏరియా ఆస్ప త్రి పని తీరు గతంలో కన్నా కొంత మెరుగైనప్పటికీ రోగుల నుంచి సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని, ఈ పద్ధతిని మానుకోవాలన్నారు.

ఏరియా ఆస్పత్రిలో అంబులెన్స్‌తో పాటు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. కలెక్టర్ రాహుల్ బొజ్జా మాట్లాడుతూ అన్ని వృత్తుల కన్నా వైద్యవృత్తి పవిత్రమైందన్నారు. మెడికల్ ఆఫీసర్లు, వైద్యులు కింది సిబ్బందిని తమ ఆధీనంలో ఉంచుకోవాలన్నారు.  వైద్యులు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే  సత్ఫలితాలు సాధిస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రోగులను వేరే ఆస్పత్రులకు రెఫర్ చేయాలన్నారు.  

త్వరలో మెదక్ ఏరియా ఆస్పత్రిలో ఒక చిన్న పిల్లల వైద్యుడు, జనరల్ ఫిజిషియన్, అనస్థీషియా నిపుణుడిని నియమించనున్నట్లు తెలిపారు.  సమావేశంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ వీణాకుమారి, డీసీఏహెచ్ నరేంద్ర బాబు, ఎన్‌ఆర్‌హెచ్‌ఎం డీపీఓ జగన్నాథం, ఈఈ రఘు, డిప్యూటీ ఈఈ రమేశ్, ఆర్డీఓ నగేశ్ గౌడ్,  మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, జెడ్పీటీసీ లావణ్య రెడ్డి, ఎంపీపీ లక్ష్మి, వివిధ ఆస్పత్రుల వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

అర్హులందరికి అసరా వర్తింపు
చిన్నశంకరంపేట: ‘ఆసరా’ పథకం కింద అర్హులందరికీ పింఛన్లను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం చిన్నశంకరంపేట మండలం శాలిపేట, టి.మాందాపూర్ గ్రామాల్లో పింఛన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పింఛన్ల జాబితాలో పేర్లు లేనంత మాత్రాన ఆందోళన చెందవద్దన్నారు. మరో సారి దరఖాస్తు చేసుకుంటే పింఛన్లు అందించేందుకు చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులకు, వితంతువులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ. 15 వందలు అందించేందుకు సీఎం కేసీఆర్ ముందుకు వచ్చారన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరిని అసరా పథకం కింద  పింఛన్ అందించి ఆదుకుంటామన్నారు. నియోజకవర్గలో రూ.125 కోట్లతో రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ నగేష్, ఎంపీపీ అధ్యక్షురాలు కృపావతి, జెడ్పీటీసీ స్వరుప, శాలిపేట, టి.మాందాపూర్ గ్రామాల సర్పంచ్‌లు మూర్తి పెద్దులు, సిద్దాగౌడ్, ఎంపీటీసీలు యాదమ్మ సత్యగౌడ్, పెంటమ్మ, ఎంపీడీఓ రాణి, తహశీల్దార్ మోహన్, సర్పంచ్‌లు రంగారావు, సత్యనారాయణ,నాగరాజ్, టీఆర్‌ఎస్ నాయకులు లకా్ష్మరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement