సంక్షేమ పథకాలు పేదలకు అందాలి
సమీక్ష సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి
రామాయంపేట: ప్రభుత్వ పథకాలు సక్రమంగా పేదలకు అందేలా అధికారులు కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులతో నష్టపోయిన రైతులకు వెంటనే ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పథకాల నిర్వహణ కోసం గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రూ.25కోట్లు వెనక్కి మళ్లిపోగా తాను ఆ నిధులను మళ్లీ వెనక్కి రప్పించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె వివిధ శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మెదక్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశంతోపాటు ఎంపీడీఓలు, తహశీల్దార్లు, రామాయంపేట, మెదక్ జెడ్పీటీసీ సభ్యులు బిజ్జ విజయలక్ష్మి, లావణ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ స్పీకర్‌కు ఘన స్వాగతం
డిప్యూటీ స్పీకర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా గురువారం రామాయంపేటకు వచ్చిన పద్మాదేవేందర్‌రెడ్డికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలు టపాసులు పేలుస్తూ బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం రామాయంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ బైక్‌షోరూంను ప్రారంభించారు.
కార్యక్రమంలో టీఆర్‌ఎస్ కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, రామాయంపేట జెడ్పీటీసీ సభ్యులు బిజ్జ విజయలక్ష్మి, లావణ్యరెడ్డి, మాజీ ఎంపీపీ అధ్యక్షుడు పుట్టి విజయలక్ష్మి, సంపత్, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, పార్టీ యువత విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండల్‌రెడ్డి, జితేందర్‌గౌడ్, ఇతర నాయకులు నార్లపూర్ నర్సింలు, స్థానిక సర్పంచ్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.