mpp office
-
అన్నపురెడ్డిపల్లి ఎంపీపీ ఏర్పాటు
సాక్షి, అన్నపురెడ్డిపల్లి: ఉమ్మడి చండ్రుగొండ మండలం నుంచి విడిపోయిన అన్నపురెడ్డిపల్లి మండలంలో ఒక జెడ్పీటీసీ, ఆరు ఎంపీటీసీ స్థానాలతో మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ) ఏర్పాటవుతుం ది. వీటికి రిజర్వేషన్లు కూడా ఖరార య్యా యి. 2016లో నూతన జిల్లాలతోపాటు నూతన మం డలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా, చండ్రుగొండ మండలం నుంచి అన్నపురెడ్డిపల్లి మండలం ఆవిర్భవించింది. అప్పుడు తహసీల్దార్, పోలీస్ స్టేషన్, వ్యవసాయాధికారి, ఐకేపీ కార్యాలయాలు మాత్రమే ఏర్పాట య్యాయి. ఎంపీడీఓ, ఎంపీపీ కార్యాలయాలు ఉమ్మడి చండ్రుగొండ మండల కేంద్రంగానే కొనసాగాయి. మండల, జిల్లాపరిషత్ ఎన్నికలు త్వ రలో జరగనున్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తయ్యాయి. తగ్గిన ఎంపీటీసీ స్థానం గతంలో అన్నపురెడ్డిపల్లి మండలంలో మొత్తం ఏడు ఎంపీటీసీ స్థానాలు ఉండేవి. మండల జనా భా ప్రాదిపదికన వీటిని కేటాయిచారు. మండలానికి ఆరు ఎంపీటీసీ స్థానాలను అధికారులు కేటాయించారు. గతంలో పెద్దిరెడ్డిగూడెం–1, పెద్దిరెడ్డిగూడెం–2 స్థానాలు ఉండేవి. తాజాగా, పెద్దిరెడ్డిగూడెం–2 ఎంపీటీసీ స్థానాన్ని అధికారులు రద్దు చేశారు. మండల మొత్తం జనాభా 21130 మంది. 2011 జనాభా లెక్కల ప్రకారంగా ప్రతి 3500 జనాభాకు ఒక ఎంపీటీసీ ఏర్పాటు చేయటంతో మండలంలో ఒక ఎంపీటీసీ స్థానం తగ్గింది. దీంతో, అన్నపురెడ్డిపల్లి మండలం ఆరు ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలతో మండల పరిషత్గా ఏర్పడనుంది. రిజర్వేషన్లు ఇలా.. ఈ మండల పరిషత్, పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. అందుకే, మొత్తం స్థానాల్లో ఎసీకి సగం, జనరల్‌కు సగం కేటాయించారు. అన్నపురెడ్డిపల్లి–1(జనరల్), అన్నపురెడ్డిపల్లి–2(ఎస్టీ జనరల్), పెంట్లం –జనరల్(మహిళ), నర్సాపురం–ఎస్టీ(మహిళ),గుంపెన–జనరల్, పెద్దిరెడ్డిగూడెం–ఎస్టీ(మహిళ) కు రిజర్వయ్యాయి. మండల పరిషత్ ప్రెసిడెంట్(ఎంపీపీ)–ఎస్టీ (జనరల్), జెడ్పీటీసీ మెంబర్–జనరల్(మహిళ)కు కేటాయించారు. ఆ స్థానంపై అందరి దృష్టి మొత్తం ఆరు ఎంపీటీసీ స్థానాలకుగాను అన్నపురెడ్డిపల్లిలోనే రెండు ఉన్నాయి. అన్నపురెడ్డిపల్లి–2 ఎస్టీ జనరల్. ఇక్కడి నుంచి గెలుపొందిన వారికి ఎంపీపీ పీఠంపై కూర్చునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న చర్చ సాగుతోంది. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు కొందరు తీవ్రంగా ప్రయ త్నిస్తున్నారు. ఇక్కడి నుంచి తన సతీమణిని బరి లోకి దింపడం ద్వారా, ఎంపీపీ పీఠాన్ని చేజిక్కిం చుకునేందుకు ఉపాధ్యాయుడొకరు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
శిథిలావస్థలో ఎంపీపీ కార్యాలయం
భయం భయంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పట్టించుకోని అధికారులు అల్లాదుర్గం: గ్రామాల అభివృద్ధికి, ప్రభుత్వ భవనాల మరమ్మతులకు నిధులు మంజూరు చేసే కార్యాలయమే శిథిలావస్థకు చేరినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. భవనం నిర్మించి 15 ఏళ్లు కాకముందే శిథిలం కావడం... భవన నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలను పాటించారో అర్థం చేసుకోవచ్చు. వర్షం పడినప్పుడు కార్యాలయం ఉరుస్తుండటంతో ప్రజలతో పాటు సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నీళ్లకు ఫైల్ తడిసి ముద్దవుతున్నాయి. అల్లాదుర్గం ఎంపీపీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. వర్షం పడితే శ్లాబ్ పైనుంచి నీళ్లు కారుతున్నాయి. ఈ భవనాన్ని 2002లో ప్రారంభించారు. భవనం నిర్మించి 15 ఏళ్లు దాటక ముందే శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని సిబ్బంది భయాబ్రాంతులకు గురవుతూనే విధులు నిర్వహిస్తున్నారు. కార్యాలయం గోడలు తడవడంతో విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉంది. వర్షపు నీటికి గోడలు పాకురుపట్టాయి. మండల సర్వసభ్య సమావేశాలను మూడు నెలలకోసారి నిర్వహిస్తున్నా... ఈ భవనం గురించి తీర్మానం చేసిన దాఖలాలు లేవు. ప్రమాదం జరిగితే తప్పా అధికారులు స్పందించరా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న భవనం మరమ్మతులకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
గెలిపించిన పార్టీ పై కూడా విశ్వాసం లేదు
పొదిలి: పదవీ కాంక్షతో, గెలిపించిన పార్టీపై కనీస విశ్వాసం కూడా లేకుండా...ఇంగిత జ్ఞానం లోపించిన ఈదర హరిబాబు చైర్మన్ కుర్చీలో కూర్చున్నారని, జిల్లా పరిషత్ చైర్మన్ నూకసాని బాలాజీ ధ్వజమెత్తారు. స్థానిక ఎంపీపీ కార్యాలయంలో గెలిపించిన పార్టీపై కూడా విశ్వాసం లేదు. శుక్రవారం రాత్రి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కలెక్టర్ ఆర్డర్‌ను కోర్టు తిరస్కరించింది...అదే చైర్మన్ కుర్చీలో కూర్చోవటానికి ఉత్తర్వుగా భావించి, కూర్చోవడం చిన్నపిల్లల చేష్టగా బాలాజీ అభివ ర్ణించారు. చైర్మన్‌గా హరిబాబు అనర్హుడని తేలిన తరువాత, అధికారుల సూచన మేరకు తాను చైర్మన్ పదవి చేపట్టానని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని, లేదా తననైనా సంప్రదించి పరిస్థితి గురించి అడగాల్సిందన్నారు. ఇవేమీ లేకుండా, నేరుగా కుర్చీలో కూర్చుంటే దాని అర్థం ఏమిటో అవగతం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జెడ్పీ సీఈవో, పంచాయతీ కమిషనర్‌కు లెటర్ పెట్టారు. టీడీపీవారు ఆ ఉత్తర్వులపై డివిజన్ బెంచికి అప్పీల్ చేశారు, ఈవిషయంలో తదుపరి ఆదేశాల కోసం సమాచారం ఇస్తున్నామని లెటర్ పెట్టారు. లీగల్ ఒపీనియన్ అనంతరం దానికి బహుశా సమాధానం వస్తుంది. రెండు మూడు రోజులు వేచి చూసే ఓపిక కూడా లేకపోతే ఎలా’ అని ప్రశ్నించారు. హరిబాబును చైర్మన్‌గిరికి అర్హుడని కోర్టు తేల్చిన మరుక్షణమే కుర్చీ వీడి, అతనికి దండ వేసి మరీ కుర్చీలో కూర్చునపెట్టే నైజం తనకుందని బాలాజీ చెప్పారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకే పదవి తప్ప, అది ఇంక దేనికీ పనికిరాద న్నారు. వైస్ చైర్మన్‌గా ఉండటం తనకు ఇష్టం లేదని, అయితే పార్టీ వ్యూహం మేరకు హరిబాబుకు సపోర్టు చేశామని చెప్పారు. చైర్మన్‌గా అధికారులు ఇచ్చిన ఆర్డర్ ఉంది, కుర్చీ ఉంది.. కారు ఉంది..జెడ్పీ సీఈవోనే బాలాజీనే జెడ్పీ చైర్మన్ అని తేల్చి చెప్పారు కదా అని అన్నారు. సమావేశంలో ఎంపీపీ కె.నరసింహారావు, కోఆప్షన్ సభ్యుడు షేక్.మస్తాన్‌వలి, పార్టీ మండల నాయకుడు వాకా వెంకటరెడ్డి, సర్పంచ్‌లు పి.శ్రీనివాసరావు, పి.ఓంకార్, వార్డు సభ్యులు షేక్.ఖాశీం, నాయకులు పి.బాలయ్య, గుంటూరు పిచ్చిరెడ్డి, టి.నరసారెడ్డి, వెలుగోలు కాశీ తద తరులు పాల్గొన్నారు. -
సంక్షేమ పథకాలు పేదలకు అందాలి
సమీక్ష సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి రామాయంపేట: ప్రభుత్వ పథకాలు సక్రమంగా పేదలకు అందేలా అధికారులు కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులతో నష్టపోయిన రైతులకు వెంటనే ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పథకాల నిర్వహణ కోసం గత ప్రభుత్వ హయాంలో మంజూరైన రూ.25కోట్లు వెనక్కి మళ్లిపోగా తాను ఆ నిధులను మళ్లీ వెనక్కి రప్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె వివిధ శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మెదక్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశంతోపాటు ఎంపీడీఓలు, తహశీల్దార్లు, రామాయంపేట, మెదక్ జెడ్పీటీసీ సభ్యులు బిజ్జ విజయలక్ష్మి, లావణ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్‌కు ఘన స్వాగతం డిప్యూటీ స్పీకర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా గురువారం రామాయంపేటకు వచ్చిన పద్మాదేవేందర్‌రెడ్డికి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలు టపాసులు పేలుస్తూ బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎల్లవేళలా కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం రామాయంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ బైక్షోరూంను ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, రామాయంపేట జెడ్పీటీసీ సభ్యులు బిజ్జ విజయలక్ష్మి, లావణ్యరెడ్డి, మాజీ ఎంపీపీ అధ్యక్షుడు పుట్టి విజయలక్ష్మి, సంపత్, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రమేష్‌రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, పార్టీ యువత విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండల్‌రెడ్డి, జితేందర్‌గౌడ్, ఇతర నాయకులు నార్లపూర్ నర్సింలు, స్థానిక సర్పంచ్ ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.