
హుందాగా సభ నిర్వహిస్తా
మెదక్: తనను డిప్యూటీ స్పీకర్ పదవి వరిస్తుందని ఊహించలేదని పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మెదక్ పట్టణంలోని ఆర్‌అండ్‌బీ విశ్రాంతి గృహంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తనకు డిప్యూటీ స్పీకర్ పదవి రావడం గర్వంగా ఉందన్నారు. ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు, మెదక్ ప్రజలకు వినమ్రంగా నమస్కరిస్తున్నానన్నారు. ఉన్నత పదవిలో ఉన్న తాను సభా సంప్రదాయాలను, మర్యాదను, హుందాతనాన్ని కాపాడేందుకు కృషి చేస్తానన్నారు. రాబోయే తరాలకు ఆదర్శంగా సభా కార్యకలాపాలు నిర్వహిస్తానన్నారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారిణిగా పోరాట పటిమను ప్రదర్శించామన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తమపట్ల కఠినంగా వ్యవహరించిందన్నారు. నిర్దాక్షిణ్యంగా మార్షల్స్‌తో అసెంబ్లీ నుంచి బయటకు గెంటివేయించారన్నారు. తాము మాత్రం గత అనుభవానుల దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్షాల సలహాలు, సూచనలను స్వీకరిస్తామన్నారు. సద్విమర్శలను ఆహ్వానిస్తామన్నారు. రైతు రుణమాఫీలో భాగంగా రూ.18వేలకోట్లను మాఫీ చేశామని, దీంతో 25 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా మెదక్ ఆర్డీఓ వనజాదేవి డిప్యూటీ స్పీకర్‌ను సన్మానించారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆమె వెంట జెడ్పీటీసీ లావణ్యారెడ్డి, కౌన్సిలర్లు మల్లికార్జున్‌గౌడ్, రాగి అశోక్, నాయకులు కృష్ణారెడ్డి, లింగారెడ్డి, పద్మారావుతోపాటు టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
మెదక్‌లో ఘన స్వాగతం
మెదక్ మున్సిపాలిటీ: డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన అనంతరం సోమవారం మొదటిసారిగా నియోజక వర్గానికి వచ్చిన పద్మాదేవేందర్ రెడ్డికి మెదక్‌లో ఘన స్వాగతం లభించింది. పట్టణంలోని టీఆర్‌ఎస్ మహిళా కౌన్సిలర్లు మంగళ హారతులతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం టీఆర్‌ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆమె పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. స్థానిక ఆర్డీఓ వజనాదేవి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశం, ఏఎంసీ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, టీఆర్‌ఎస్ సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కరణం వెంకటేశంతో పాటు పలువురు నేతలు, అధికారులు వేర్వేరుగా ఆమెను సన్మానించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజక వర్గ అభివృద్ధి విషయంలో అధికారులు, నాయకులు తనకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఇంజినీర్ చిరంజీవులు, టీపీఎస్ కొమురయ్య, మెదక్ డీఎస్పీ గోద్రు, పట్టణ సీఐ విజయ్ కుమార్, ఎస్సై అంజయ్య, వేణు, ఏఎస్సై రాజశేఖర్, టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు మల్లికార్జున్ గౌడ్, రాగి ఆశోక్, మాయ మల్లేశం, సలాం, జెల్ల గాయత్రి, చంద్రకళ, ఆరేళ్ల గాయత్రి, మెంగని విజయ లక్ష్మి, గోవిందు, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రావు, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు క్రిష్ణా రెడ్డి, లింగారెడ్డి, గంగాధర్, హామీద్‌లతో పాటు పలువురు టీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
నవ తెలంగాణ నిర్మాణానికి కృషి
చిన్నశంకరంపేట: తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వారి త్యాగం వెలకట్టలేనిదని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ 60 ఏళ్లుగా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రాంత సమస్యలపై శాసనసభలో జరిగే చర్చలకు సంపూర్ణ సహకారం అందించి తెలంగాణ అబివృద్ధికి కృషిచేస్తానన్నారు. తెలంగాణ ప్రభుత్వం కోల్పోయిన వనరులను కాపాడుకుంటూ నవ తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో చిన్నశంకరంపేట జెట్పీటీసీ స్వరూప,ఎంపీటీసీలు విజయలక్ష్మి,వెంకటి,టీఆర్‌ఎస్ నాయకులు లకా్ష్మరెడ్డి,రామ్‌రెడ్డి, తదితరులు ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.