
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సోమవారం నోటిఫికేషన్‌ను జారీ చేశారు. జూన్ 18వ తేదీన ఉదయం 11గంటలకు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుందని ఆయన వెల్లడించారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన నామినేషన్లను ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు దాఖలు చేసుకోవచ్చునని తెలిపారు. అనంతరం గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో చర్చ మొదలైంది. సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ప్రభుత్వ విప్ ముత్యాల నాయుడు ఈ తీర్మానాన్ని బలపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment