
చేతికాగితం తయారీని పరిశీలిస్తున్న పద్మాదేవేందర్‌రెడ్డి
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం దుర్శేడ్‌లోని గాంధీ చేతికాగిత పు పరిశ్రమను గురువారం శాసనసభ ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి సందర్శించారు. పాతబట్టలు,వ్యర్థ పదార్ధాలను ఉపయోగించి త యారు చేస్తున్న కాగితాలు, వాటితో వివిధ ఆకృతుల్లో రూపొందిస్తున్న వస్తువులను పరిశీలించారు. చేతికాగితపు చెట్లను పరిరక్షించడం జరుగుతుందని, గ్రామీణ మహిళలు ఉపాధి కలుగుతుందని తెలిపారు. పరిశ్రమ నిర్వాహకులు జె. రఘునందన్‌రావు తదితరులు ఉన్నారు.