కిక్కు కోసం.. బాస్‌కు రిజైన్‌ లెటర్‌ దేని మీద రాసిచ్చాడంటే ! | Man Writes Resignation Letter On Toilet Paper Goes Viral | Sakshi
Sakshi News home page

Resignation Letter On Toilet Paper: కిక్కు కోసం. .. బాస్‌కు రిజైన్‌ లెటర్‌ దాని మీద రాసి ఇచ్చాడు !

Published Fri, Nov 26 2021 2:24 PM | Last Updated on Fri, Nov 26 2021 3:35 PM

Man Writes Resignation Letter On Toilet Paper Goes Viral - Sakshi

సాధారణంగా ఉద్యోగులు తాము పని చేస్తున్న కంపెనీ నచ్చకపోతే రాజీనామా చేయడం సహజం. అందుకు వారు ఏ వైట్‌ పేపర్‌పైనో, లేదా మెసేజ్‌, ఈ మెయిల్‌ ద్వారా పంపడం సహజమే. ఎవరు రాజీనామా చేయాలన్నా ఇదే ఫాలో అవుతారు. కానీ ఓ ఉద్యోగి మాత్రం కాస్త భిన్నంగా ఉంటుందని భావించాడో, లేదా బాస్‌పై కోపమో గానీ తన రాజీనామాను విచిత్రంగా రాశాడు. అంతేనా.. అతను ఏ పేప‌ర్ మీద రాశాడో తెలిస్తే షాక్‌తో పాటు యాక్ కూడా అంటారు మరీ.  అసలు ఆ ఉద్యోగి చేసిన నిర్వాకం ఏంటంటే..

ఓ ఉద్యోగి తన కంపెనీకి రిజైన్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. అందరూ ఇచ్చినట్లు తన రాజీనామాను ఇస్తే కిక్కు లేదనుకున్నాడు. అందుకే.. ఏకంగా టాయిలెట్ పేప‌ర్ మీద త‌న రాజీనామా లేఖ‌ను రాశాడు. ఈ నెల 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను అని రాసి.. త‌న బ్యాక్ చూపిస్తున్న‌ట్టుగా డ్రాయింగ్ కూడా వేశాడు. దాన్ని రెడిట్‌లో పోస్ట్ చేసి.. మా బాస్‌కు ఇదే రాజీనామా ప‌త్రాన్ని ఇవాళ ఇవ్వ‌బోతున్నా అంటూ క్యాప్ష‌న్ కూడా పెట్టాడు.

ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారి హల్‌ చల్‌ చేస్తోంది. టిష్యూ పేపర్‌పై రాసిన లెటర్‌ని చూసిన నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు. బాప్‌రే.. ఇలాంటి రిజైన్‌ లెటర్‌ నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌ అని కామెంట్లు పెడుతున్నారు.

చదవండి: ఇంటర్వ్యూలో అన్నీ కరెక్ట్‌గా చెప్పినా.. ఆ సిల్లి కారణంతో రిజెక్ట్‌ చేశారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement