
ఇంటిప్స్
లెదర్ చెప్పులు, షూస్, హ్యాండ్ బ్యాగ్‌లు కొత్తవాటిలా మెరవాలంటే... వాటి మీద పట్టిన దుమ్ము తుడిచి ఆ తర్వాత ఉల్లిపాయ తొక్కలతో రుద్దాలి. ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కిరోసిన్ వేస్తే ఈగలు, దోమలు రావు.
ఉడెన్ ఫర్నిచర్‌ను పేపర్‌తో తుడిస్తే పాలిష్ చేసినట్లు మెరుస్తాయి. పేపర్‌తో తుడవడం వల్ల సందుల్లోని దుమ్ము పూర్తిగా వదలదు. కాబట్టి ముందుగా మెత్తటి క్లాత్‌తో తుడిచి తర్వాత పేపర్‌తో తుడవాలి.