
పోస్ట్‌లో వచ్చిన బాండ్‌పేపర్ నకలు
కొడిమ్యాల(చొప్పదండి): ఈనెల 22న నిర్వహిం చనున్న గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నా రు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెద క్ ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థి మామిడి సుధాకర్‌రెడ్డి బాండ్‌పేపర్‌పై హామీలను ముద్రించి, పోస్ట్‌ద్వారా అభ్యర్థులకు పంపిణీ చేస్తున్నారు. తనను ఎన్నుకుంటే సీపీఎస్‌ను రద్దుచేపిస్తానని, కాంట్రాక్టు అధ్యాపకులకు హెల్త్‌కార్డులు మంజూరు చేపిస్తానని, అధ్యాపకులకు ఇంటిస్థలాలు సమకూరుస్తానని బాండ్‌పై హామీ లు ముద్రించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తాను 20 సంవత్సరాల భావి ఉద్యోగ జీవితాన్ని వదులుకుని పోటీలోఉన్నానని, దివ్యాంగుడినైనందున అందరినీ వ్యక్తిగతంగా కలవలేకపోతున్నందున బాండ్‌ద్వారా హామీలను తెలుపుతున్నానని, ఆశీర్వదించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment