కాగితపు నీడ !
ఎండలు మండుతున్నాయి.. ఎండ వేడిమికి జీవరాశులన్నీ విలవిల్లాడుతున్నాయి. మొక్కలు సైతం మలమల మాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి. అరటి సాగు చేసిన రైతులు మొక్కలను కాపాడుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఒక్కో అరటి మొక్క రూ.12 వెచ్చించి ఎకరాకు 1200 మొక్కలు నాటితే ఎండ తీవ్రతకు కనీసం 50 శాతం మొక్కలు బతకడమూ గగనమైంది. పుట్లూరు మండలంలోని కడవకల్లు, చెర్లోపల్లి, ఓబుళాపురం తదితర గ్రామాల్లో అరటì మొక్కలు సాగు చేసిన వాటిపై ‘వి’ ఆకారంలో పేపర్‌ను మడిచి మొక్కపై ఎండ నేరుగా పడకుండా రక్షణ కల్పిస్తున్నారు. ఇలా పేపర్ల ద్వారా 15 రోజుల పాటు రక్షణ కల్పించి, మొక్కలను బతికించుకుంటే ఎలాంటి నష్టమూ జరగదని రైతులు చెప్తున్నారు. అరటి మొక్కలను కాపాడుకోవడానికి వినియోగిస్తున్న న్యూస్ పేపర్లు కిలో రూ.20 వెచ్చించి రైతులు కొనుగోలు చేస్తున్నారు.
- పుట్లూరు (శింగనమల)