banana tree
-
ఆంధ్ర ‘అమృతపాణి’కి పునర్జీవం
సాక్షి, అమరావతి: దాదాపు మూడు దశాబ్దాల క్రితం కనుమరుగైపోయిన ఆంధ్ర ‘అమృతపాణి’ డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్శిటీ శాస్త్రవేత్తల విశేష కృషి వల్ల మళ్లీ జీవం పోసుకుంటున్నది. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, పురాతనమైన ఈ అరటి రకం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ప్రత్యేకమైంది. ఒకప్పుడు గోదావరి జిల్లాలతో పాటు ప్రతీ ఇంటి పెరట్లో విస్తృతంగా సాగయ్యేది. అలాంటి ఈ అరుదైన రకం ప్రస్తుతం అంతరించిపోయిన అరటి రకాల జాబితాలో చేరింది. 1950–60 దశకంలో ‘పనామా’ తెగులు ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా సాగులో ఉన్న ‘గ్రాస్ మైఖెల్’తో పాటు మన దేశానికి చెందిన నాన్జనుడ్ రసబలి, రస్తాలి, శబరి, అమృతపాణి వంటి రకాలు కనుమరుగైపోయాయి. పునరుత్పత్తి కోసం విస్తృత పరిశోధనలు.. అంతరించిపోయిన ఆంధ్ర అమృతపాణి రకాన్ని పునరుత్పత్తి చేయాలన్న సంకల్పంతో ఉద్యాన వర్శిటీ గత కొన్నేళ్లుగా విస్తృత పరిశోధనలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వర్సిటీకి అనుబంధంగా ఉన్న కొవ్వూరు ఉద్యాన పరిశోధనా శాస్త్రవేత్తల బృందం రెండేళ్ల క్రితం మారేడుమిల్లి మండలం కొండవాడ గ్రామంలో అరగటి సుబ్బారెడ్డి అనే గిరిజన రైతు ఇంటి పెరట్లో ఉన్న అరటి మొక్కలను చూసి ఆశ్చర్యపోయారు. మొక్కల కాండం, ఆకులు, గెల, కాయల లక్షణాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు దేశవాళి అమృతపాణి రకంగా గుర్తించారు. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 300 అడుగులు ఎత్తులో ఉండడంతో ఎలాంటి పోషక, కలుపు యాజమాన్య పద్ధతులు చేపట్టకపోయినా ఎలాంటి తెగుళ్లు సోకకుండా మొక్కలు ఆరోగ్యకరంగా ఉన్నట్లు గుర్తించారు. అక్కడ నుంచి సేకరించిన మొక్కల నుంచి ఇప్పటి వరకు 3వేల టిష్యూ కల్చర్ దేశవాళి అమృత పాణి రకం మొక్కలను అభివృద్ధి చేశారు. గిరిజన ప్రాంతం అనుకూలం దేశవాళి అమృతపాణి సాగుకు గిరిజన ప్రాంతం అనువైనదిగా గుర్తించారు. ఎత్తయిన గిరిజన ప్రాంతాలు కావడంతో పాటు దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఈ నేలలో సేంద్రీయ కర్బనం అధికంగా ఉండడం వలన మొక్కలకు అవసరమైన అన్ని రకాలైన పోషక పదార్థాలు అందుతున్నాయని గుర్తించారు. పైగా వాణిజ్యపరంగా, ఇతర ఉద్యానపంటలతో కలిపి సాగు చేయకపోవడం వలన ఈ నేలల్లో తెగుళ్లను కలిగించే శిలీంధ్రాల ఉనికి లేదని గుర్తించారు. గిరిజన రైతులకు పంపిణీ అల్లూరి సీతారామరాజు జిల్లా పెదగెద్దాడ పంచాయతీ పరిధిలో వెయ్యి టిష్యూ కల్చర్ అమృతపాణి మొక్కలను వంద మంది గిరిజన రైతులకు ఇటీవలే ఉద్యాన వర్శిటీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఎస్టీ సబ్ ప్లాన్ కింద మరో 2వేల మొక్కలను జూన్‌లో పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. అమృతపాణికి ఎన్నో ప్రత్యేకతలు ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ప్రత్యేకమైన ఈ రకానికి వాణిజ్యపరంగా మంచి డిమాండ్ ఉంది. ఇతర రాష్ట్రాలలోని రస్తాలి, రసబలె, రసకేళి, మల్ఫోగ్, సాప్కాల్, మార్టమాన్, దూద్ సాగర్ వంటి రకాల లక్షణాలను పోలి ఉంటుంది. 11–12 నెలల కాలపరిమితితో 2.5–3 మీటర్లు ఎత్తు వరకు పెరుగుతూ సగటున 15–18 కిలోల బరువైన గెలలు వేస్తుంది. కాయలు లేత దశలో పసుపు ఆకుపచ్చ రంగులో, పక్వదశలో లేత పసుపువర్ణం నుండి బంగారు వర్ణంలోకి మారతాయి. పలుచని తొక్కతో ప్రత్యేకమైన రుచి, సువాసన కలిగి ఉంటాయి. పక్వ దశలో పండ్లు గెల నుంచి రాలిపోయే లక్షణం ఉండడంతో దూర ప్రాంత రవాణాకు అనుకూలం కాదు. గిరిజనులకు అదనపు ఆదాయ వనరు అరుదైన ఈ జన్యురకాన్ని పరిరక్షించడం, విస్తృతంగా సాగులోకి తీసుకురావడం లక్ష్యంగా విస్తృత పరిశోధనలు చేస్తున్నాం. వీటి సాగుకు అనువైన గిరిజన ప్రాంతంలో ఈ రకం సాగును ప్రోత్సహించాలని సంకల్పించాం. గిరిజనులకు మంచి పోషకాహారంగానే కాకుండా అదనపు ఆదాయ వనరుగా ఉపయోగపడుతుంది. – టి.జానకీరామ్, వీసీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ కణజాల ప్రవర్ధన పద్ధతిలో పునరుత్పత్తి అంతరించిపోయిన ఈ అరుదైన రకాన్ని పరిరక్షిస్తున్న గిరిజన రైతు సుబ్బారెడ్డిని ముందుగా అభినందించాలి. దాదాపు ఐదారు దశాబ్దాల నుంచి పెంచుకుంటూ వాటిని పరిరక్షిస్తుండడం వలనే ఈ మొక్కల నుంచి పునరుత్పత్తి చేయగలిగే అవకాశం మనకు దక్కింది. ఈ మొక్కల నుంచి సేకరించిన మగపువ్వులలోని లేత హస్తాలను కణజాల ప్రవర్ధన పద్ధతిలో దశల వారీగా ప్రవర్ధనం చేసి ఎలాంటి తెగుళ్లు సోకని మొక్కలను పునరుత్పత్తి చేశాం. – డాక్టర్ కె.రవీంద్రకుమార్, సీనియర్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధనా కేంద్రం, కొవ్వూరు -
వైరల్: అరటి గెల మీద పడిందని రూ.4 కోట్లు రాబట్టాడు
బెర్న్: ప్రమాదవశాత్తు సంస్థలో పనిచేసే కార్మికులకు గాయాలైతే లేదా చనిపోతే సదరు సంస్థే నష్టపరిహారం చెల్లిస్తుంది. ప్రమాద తీవ్రదతను బట్టి కొంత మొత్తాన్ని వారికి అప్పజెప్పుతుంది. అయితే తాజాగా ఓ అరటి తోటలో పనిచేసే కార్మికుడిపై అరటి చెట్టు పడటంతో యాజమానిపై దావా వేసి ఏకంగా 4 కోట్లు రాబట్టాడు. ఈ ఆశ్యర్యకర ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. చదవండి: Viral: కళ్లు పోతేనేం.. అతని పట్టుదలముందు ఏ కష్టమైనా దిగదుడుపే! క్వీన్స్‌ల్యాండ్‌లో సమీపంలోని ఎల్ అండ్ ఆర్ కాలిన్స్‌కు చెందిన అరటి తోటలో జైర్ లాంగ్ బాటమ్ అనే వ్యక్తి పని చేస్తున్నాడు. కాపుకు వచ్చిన చెట్లనుంచి అరటి పండ్ల గెలలను నరుకుతుండగా ప్రమాదవశాత్తు అరిటి పండ్ల గెలతో పాటు అరటి చెట్టుకూడా అతనిపై పడింది. దాంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. దెబ్బలు తీవ్రంగా తగలటంతో లాంగ్ బాటమ్ వికలాంగుడైపోయాడు. ప్రమాదం కారణంగా పనిచేయలేక ఉపాధి కోల్పోయాడు. దీంతో బాధితుడు తనకు పరిహారం కోరుతూ అరటితోట యజమానిపై క్వీన్స్‌ల్యాండ్ సుప్రీంకోర్టులో పిటీషన్ వేశాడు. ఇది 2016లో జరిగింది. చదవండి: డ్యాన్స్ ఇరగదీసిన వధువు.. అంతా ఫిదా, అయితే వరుడు మాత్రం..! ఈ పిటీషన్‌పై కోర్టు విచారణ ఇప్పటి వరకు కొసాగింది. తాజాగా మరోసారి ఈ కేసుపై కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా అరటి పండ్ల గెల మీద పడటం కారణంగానే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని, ఆ ఘటన వల్లనే అతను జీవితాంతం ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందని కోర్టు అభిప్రాయపడింది.. కాబట్టి ఆ కూలీకి యజమాని 502,740 డాలర్ల పరిహారాన్ని అంటే భారత కరెన్సీలో 3,77,15,630 రూపాయలను చెల్లించాలని అరటి తోట యజమానిని కోర్టు ఆదేశించింది. ఇలా క్వీన్స్లాండ్ సుప్రీంకోర్టు అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో చేసేందేంలేక సదరు యజమాని కూలీకి పూర్తి నష్టపరిహారం చెల్లించాడు. -
మన అరటి.. ఎంతో మేటి!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: మన ప్రాంత అరటి అంతర్జాతీయ మార్కెట్లోనూ సత్తా చాటుతోంది. ఎగుమతులను పెంచుకుంటూ రైతులకు భరోసా కల్పిస్తోంది. ఎగుమతులను మరింతగా ప్రోత్సహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ కొనుగోలుదారులు, అమ్మకందారులతో ఇప్పటికే ఒక వేదికను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 35 వేల టన్నుల అరటి పండ్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయంతో రానున్న రోజుల్లో అరటి సాగుదారులకు మరింత ప్రయోజనం కలగనుంది. మన అరటి విశేషాలివీ.. ♦ రాష్ట్రంలో 1,12,995 హెక్టార్లలో అరటి సాగవుతోంది. ఏటా 63,84,730 టన్నుల అరటి పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ♦ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అరటి సాగవుతుండగా.. విస్తీర్ణం, ఉత్పత్తిలో కడప ప్రథమ స్థానంలో ఉంది. ఉభయ గోదావరి జిల్లాలు రెండో స్థానంలో నిలిచాయి. ♦ మధ్య ప్రాచ్య దేశాలైన యూఏఈ, బెహ్రయిన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, ఇరాన్ దేశాల్లో మన అరటికి మంచి డిమాండ్ ఉంది. ♦ గ్రీన్ కావెండిష్ ప్రీమియమ్ రకాలు ఆ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2016–17లో 246 టన్నుల అరటి పండ్లు ఎగుమతి కాగా.. 2017–18లో 4,300 టన్నులు, 2018–19లో 18,500 మెట్రిక్ టన్నులకు ఎగుమతులు పెరిగాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 35 వేల మెట్రిక్ టన్నుల అరటి పండ్లను ఎగుమతి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ♦ ప్రస్తుతం కొవ్వూరులో మాత్రమే అరటి పరిశోధనా స్థానం ఉంది. సాగు విస్తీర్ణాన్ని పెంచడంతోపాటు మార్కెట్‌ను విస్తరించేందుకు వీలుగా డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ ఏడాది కడప జిల్లా పులివెందులలో అరటి పరిశోధనా కేందం ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేశారు. దీని కోసం ప్రభుత్వం 70 ఎకరాల భూమిని, పరిశోధనల కోసం 628 ఎకరాల భూమిని కేటాయించింది. ♦ అరటి పంటను వెంటాడుతున్న వెర్రితల, గొడ్డు, లీప్ స్టీక్ వైరస్ తెగుళ్లను పూర్తిగా నివారించేందుకు టిష్యూ కల్చర్ విధానంలో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఎగుమతి లక్ష్యంగా ఉత్పత్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం, పంట ఉత్పత్తిని పెంచేవిధంగా పరిశోధనలు సాగుతున్నాయి. నాణ్యమైన అరటి.. కేరాఫ్ పులివెందుల రాష్ట్రంలో 63.84 లక్షల టన్నుల అరటి పండ్లు ఉత్పత్తి అవుతుండగా.. ఇందులో ఒక్క వైఎస్సార్ కడప జిల్లా నుంచే 23,15,300 టన్నుల దిగుబడి వస్తోంది. ఒక్క పులివెందులలోనే 1,100 హెక్టార్లలో అరటి సాగవుతుండగా.. ఇక్కడి పంటకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. సాధారణంగా అరటి పండ్లు 6, 7 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి. ఇక్కడి పండ్లు 14 రోజుల వరకు నిల్వ ఉంటాయి. టిష్యూకల్చర్ వచ్చాక పండ్లలో నాణ్యత పెరిగింది. కడప జిల్లాలో పండే అరటిలో 80 శాతం చెన్నై, బెంగళూరు నగరాలకు ఎగుమతి అవుతున్నాయి. ఢిల్లీ నుంచి విదేశాలకు.. పులివెందులలో పండించిన అరటి పంట విదేశాలకు ఎగుమతి అవుతోంది. అరటి కోతల సమయంలో ఢిల్లీ వ్యాపారులు ఇక్కడి కొచ్చి గెలలు కొనుగోలు చేస్తుంటారు. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ పండిన అరటి వారం రోజులపాటు నిల్వ చేసినా దెబ్బతినవు. నాణ్యతతో కూడిన అరటి కావడంతో ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఎక్కువగా టిష్యూకల్చర్‌ను సాగు చేస్తున్నాం. ఇంకా తెగుళ్లను తట్టుకునే నాణ్యమైన మొక్కలను సరఫరా చేసి రైతులకు అందించాలి. ఇందుకోసం పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – శ్రీరామిరెడ్డి, అరటి రైతు, భూమయ్యగారిపల్లె, వైఎస్సార్ కడప జిల్లా ఎగుమతి కేంద్రం అవసరం పదెకరాలలో అరటి సాగు చేశా. మంచి దిగుబడి వస్తోంది. ఇక్కడ అరటి పండ్లు నాణ్యంగా ఉండటంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో అరటి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుండటం హర్షణీయం. ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా ఎగుమతి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తే రైతులకు మేలు కలుగుతుంది. – గంగాధరరెడ్డి ఆలియాజ్ బాబు, అరటి రైతు, లింగాల, వైఎస్సార్ కడప జిల్లా -
తల లేకున్నా గెల వేసింది.
అమలాపురం : అరటి చెట్టు కొన్నాళ్లు ఎదిగాక, మొవ్వు నుంచి కోటాకు వేసి, ఆనక దాన్నుంచి పువ్వు వచ్చి, అది గెలగా అభివృద్ధి చెందుతుంది. ఇదీ ఏ అరటి చెట్టయినా ఫలసాయాన్నిచ్చే క్రమం. అయితే ఓ అరటిచెట్టును మొదలంటా నరికేసినా.. తల లేని మెండెం లాంటి మొదలు నుంచే గెల వేసి, కాయలు ఏపుగా ఎదుగుతున్నాయి. కొత్తపేట మండలం అవిడిరేవు సమీపంలో కొబ్బరిరైతు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ ఆడిటర్ ఉద్దరాజు ప్రసాదరాజు సాగుచేస్తున్న తోటలో ఓ అరటిచెట్టును తెగులు కారణంగా నరికేశారు. అయితే ఆ చెట్టు మొదలు నుంచే గెల వచ్చి, ఎదుగుతూ..‘నన్ను నేలకూల్చినా.. చైతన్యబావుటానై నింగికెగుస్తా’ అన్న ఓ విప్లవకారుడి మాటలను గుర్తుకు తెస్తోంది. అదే తోటలో ఆ చెట్టు పక్కనే నరికిన మరో చెట్టు మొదలు నుంచి కొత్త పిలక వచ్చి, అనతి కాలంలోనే గెల వేయడం మరో విశేషం. ఆ సమీపంలో ఉన్న ప్రసాదరాజుకే చెందిన మరో తోటలో ఒకే విత్తనం కొబ్బరికాయ నుంచి ఏకంగా మూడు మొక్కలు రావడం ఇంకో తమాషా. ఆ మూడు మొక్కలూ ప్రస్తుతానికి ఏపుగా పెరుగుతున్నాయని, కాపు ఎలా ఉంటుందో చూడాలని ప్రసాదరాజు ‘సాక్షి’తో అన్నారు. -
కాగితపు నీడ !
ఎండలు మండుతున్నాయి.. ఎండ వేడిమికి జీవరాశులన్నీ విలవిల్లాడుతున్నాయి. మొక్కలు సైతం మలమల మాడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మార్చి నెలలోనే ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరిగాయి. అరటి సాగు చేసిన రైతులు మొక్కలను కాపాడుకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఒక్కో అరటి మొక్క రూ.12 వెచ్చించి ఎకరాకు 1200 మొక్కలు నాటితే ఎండ తీవ్రతకు కనీసం 50 శాతం మొక్కలు బతకడమూ గగనమైంది. పుట్లూరు మండలంలోని కడవకల్లు, చెర్లోపల్లి, ఓబుళాపురం తదితర గ్రామాల్లో అరటì మొక్కలు సాగు చేసిన వాటిపై ‘వి’ ఆకారంలో పేపర్‌ను మడిచి మొక్కపై ఎండ నేరుగా పడకుండా రక్షణ కల్పిస్తున్నారు. ఇలా పేపర్ల ద్వారా 15 రోజుల పాటు రక్షణ కల్పించి, మొక్కలను బతికించుకుంటే ఎలాంటి నష్టమూ జరగదని రైతులు చెప్తున్నారు. అరటి మొక్కలను కాపాడుకోవడానికి వినియోగిస్తున్న న్యూస్ పేపర్లు కిలో రూ.20 వెచ్చించి రైతులు కొనుగోలు చేస్తున్నారు. - పుట్లూరు (శింగనమల) -
అరటి చెట్టు నుంచి విద్యుత్
గౌరీపట్నం(దేవరపల్లి), న్యూస్‌లైన్: ఈ నెల 23న ఏలూరు బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీల్లో దేవరపల్లి మండలం గౌరీపట్నం జెడ్పీ హైస్కూలు విద్యార్థులు చూపిన ప్రదర్శనకు జిల్లాస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. అరటి చెట్టి నుంచి విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని ఈ విద్యార్థులు నిరూపించారు. అడవుల్లోను. రోడ్డు పక్కన గల పాలు కారే చెట్లు నుంచి విద్యుత్ బల్బులను వెలిగించవచ్చునని ప్రదర్శించారు. లీడర్ కేవీవీఆర్ఎస్ విష్ణుకు సహయలీడర్ ఎ.లఖిల, విద్యార్థులు ఎ.దుగ్గిరాజు, డి.రాజేష్, కె. వెంకటేష్ ఈప్రాజెక్టును తయారు చేశారు. కంప్యూటర్ ఆపరేటర్ ఆర్. ప్రసాద్ సహకరించారు.విదార్థులను ఎంఈవో జి.రత్నకుమార్, ఉపాధ్యాయులు అభినంధించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపికైందని ఉపాధ్యాయుడు రాజు తెలిపారు.