
యాపిల్ ఇటీవల తన ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేసింది. ఐఫోన్ 16 సిరీస్ ఇప్పుడు సెప్టెంబర్ 13 నుంచి భారతదేశంలో ప్రీ-ఆర్డర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ జాబితాలో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. వీటిని వివిధ మార్గాల్లో బుక్ చేసుకోవచ్చు.
ఫ్రీ ఆర్డర్ ఎక్కడ చేయాలంటే..
యాపిల్ స్టోర్ ఆన్లైన్
యాపిల్ స్టోర్ బీకేసీ, ముంబై
యాపిల్ స్టోర్ సాకేత్, ఢిల్లీ
అమెజాన్
ఫ్లిప్కార్ట్
క్రోమా
విజయ్ సేల్స్
రిలయన్స్ డిజిటల్
యూనికార్న్ స్టోర్స్
ఇమాజిన్ స్టోర్స్
ఆప్రోనిక్ స్టోర్స్
మాపుల్ స్టోర్స్
ఐప్లానెట్ స్టోర్స్
ఐకాన్సెప్ట్ స్టోర్స్
పైన పేర్కొన్న స్టోర్లలలో లేదా అధికారిక వెబ్‌సైట్లలో ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండటం మంచింది. ఎందుకంటే అధికారిక వెబ్‌సైట్స్ మాదిరిగానే ఉంటూ.. పలువురు సైబర్ నేరగాళ్లు మోసం చేసే అవకాశం ఉంది.
డిస్కౌంట్ వివరాలు
ఐఫోన్ 16 సిరీస్ బుక్ చేసుకునేవారు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డు ద్వారా బుక్ చేసుకుంటే రూ. 5000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ డిస్కౌంట్ 16 సిరీస్ అన్ని మోడళ్లకు వర్తిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ ఎంచుకునే వారు మూడు లేదా ఆరు నెలల పేమెంట్ ప్లాన్ ఎంచుకోవచ్చు. యాపిల్ ట్రేడ్ ఇన్ ప్రోగ్రాం కింద ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ. 4000 నుంచి రూ. 67500 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు మీరు ఎక్స్చేంజ్ చేసే ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.
ఇదీ చదవండి: ఆరడుగుల ఐఫోన్.. ఇదే వరల్డ్ రికార్డ్
భారత్‌లో ఐఫోన్ 16 సిరీస్ ధరలు
ఐఫోన్ 16
128 జీబీ: రూ. 79900
256 జీబీ: రూ. 89900
512 జీబీ: రూ. 109900
ఐఫోన్ 16 ప్లస్
128 జీబీ: రూ. 89900
256 జీబీ: రూ. 99900
512 జీబీ: రూ. 119900
ఐఫోన్ 16 ప్రో
128 జీబీ: రూ. 119900
256 జీబీ: రూ. 129900
512 జీబీ: రూ. 149900
1 టీబీ: 169900
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్
256 జీబీ: రూ. 144900
512 జీబీ: రూ. 164900
1 టీబీ: రూ. 184900