
బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ సందడి చేసింది. కొండాపూర్‌లోనిఓ మాల్‌లో ఆమె భర్త కశ్యప్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొంది.సెల్ఫీలు దిగుతూ అభిమానులను అలరించింది.
గచ్చిబౌలి: కొండాపూర్‌లోని శరత్ సిటీ క్యాపిటల్ మాల్‌లో ఏర్పాటు చేసిన కైరా స్టోర్‌ను బ్యాడ్మింటన్ స్టార్స్, దంపతులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడల్స్‌తో కలిసి న్యూ కలెక్షన్స్‌ను ప్రదర్శించారు. త్వరలో మలేసియాలో జరగనున్న నేషనల్ టోర్నమెంట్ సిద్ధమవుతున్నానని సైనా చెప్పారు. దేశవ్యాప్తంగా 111 స్టోర్‌లు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కైరా డైరెక్టర్లు దినేశ్ మంగ్లాని, కరిష్మా మంగ్లానిపాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment