నగరంలోని మూడు దుకాణాల్లో చోరీ | Theft in three stores at hyderabad vanasthalipuram | Sakshi
Sakshi News home page

నగరంలోని మూడు దుకాణాల్లో చోరీ

Published Wed, Nov 30 2016 8:49 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

Theft in three stores at hyderabad vanasthalipuram

హైదరాబాద్: తాళం వేసి ఉన్న మూడు దుకాణాలలో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. నగరంలోని వనస్థలిపురం కాలనీలో మంగళవారం రాత్రి మూడు దుకాణాల షట్టర్‌లు పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు దుకాణాల్లోని నగదుతో పాటు విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు.

ఇది గుర్తించిన షాపుల యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఎంత మొత్తంలో నగదు చోరీకి గురైంది అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement