న్యూఢిల్లీ: వాహన తయారీ దిగ్గజం బజాజ్ ఆటో చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని జూన్ నాటికి రెండింతలకు చేర్చనున్నట్టు ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫేమ్–2 పథకం పొడిగింపు విషయంలో నెలకొన్న అనిశ్చితిని దృష్టిలో పెట్టుకుని ఎక్స్‌క్లూజివ్ స్టోర్ల విస్తరణ చేపడుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం నెలకు 5,000 యూనిట్లను తయారు చేస్తున్నట్టు కంపెనీ ఈడీ రాకేశ్ శర్మ తెలిపారు. ‘విడిభాగాలు సరఫరా చేసే కొందరు వెండార్లపై పెద్ద ఎత్తున ఆధారపడ్డాం. వారు సకాలంలో సరఫరా చేయకపోవడంతో సమస్యలు ఎదుర్కొన్నాం.
సరఫరా సమస్యల నుంచి గట్టెక్కాం. అది మాకు కొంత విశ్వాసాన్ని ఇస్తోంది. మే నెలలో ఉత్పత్తి 7,000 యూనిట్లకు, జూన్‌లో 10,000 యూనిట్లకు చేరనుంది. డిమాండ్‌నుబట్టి భవిష్యత్‌లో ఉత్పత్తి ఏ స్థాయిలో ఉండాలో నిర్ణయిస్తాం. ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్ల సంఖ్య ప్రస్తుతం ఉన్న 105 నుంచి సెప్టెంబర్‌కల్లా సుమారు 150 తాకనుంది. సరఫరా సమస్యలు తొలగిపోయి డిమాండ్ కొనసాగి, నెట్‌వర్క్ విస్తరణతో 2023–24లో బజాజ్ ఆటో చేతక్‌తోపాటు ‘యూలుకు’ సరఫరా చేసిన వాహనాలతో కలిపి విక్రయాలు ఒక లక్ష యూనిట్లకు ఎగుస్తుంది’ అని వివరించారు.
సబ్సిడీ పొడిగించాల్సిందే..
ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంపొందించే పథకం ఫేమ్–2 పొడిగింపుపై ఈ ఏడాది సెప్టెంబర్‌కల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉందని బజాజ్ ఆటో అర్బనైట్ బిజినెస్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ పేర్కొన్నారు. ‘పొడిగింపు నిర్ణయానికి ముడిపడి చాలా అంశాలు ఉన్నాయి. సబ్సిడీని నిలిపివేస్తే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు గణనీయంగా
పెరుగుతాయి. ’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment