హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీ, కాఫీ వంటి పానీయాల విక్రయంలో ఉన్న డికాక్షన్ 100 స్టోర్ల మైలురాయిని అధిగమించింది. కార్యకలాపాలు మొదలైన ఏడాదిన్నరలోపే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఏపీ, తెలంగాణలో 25 నగరాలు, పట్టణాల్లో 110 స్టోర్లున్నాయని డికాక్షన్ ఫుడ్స్, బెవరేజెస్ కో–ఫౌండర్ అద్దేపల్లి సంతోషి తెలిపారు. ఒక్కటి మినహా మిగిలిన కేంద్రాలన్నీ ఫ్రాంచైజీలవేనని చెప్పారు ‘ఏప్రిల్ నాటికి 130 ఔట్‌లెట్లు దాటతాం. కర్నాటక నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోనే 70 కేంద్రాలు ఉన్నా యి. ఫ్రాంచైజీల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు. 80 లక్షల మందికిపైగా కస్టమర్లను సొంతం చేసుకున్నాం. మిల్క్ షేక్స్, థిక్ షేక్స్ వంటి పానీయాలూ విక్రయిస్తున్నాం. ప్రతి కేంద్రానికి 2–4 మందికి ఉపాధి లభిస్తోంది’ అని తెలిపారు.
తొలుత ఫ్రాంచైజీ కేంద్రాలు..
సొంత స్టోర్ కంటే ముందే రెండు ఫ్రాంచైజీ కేంద్రాలు ఏర్పాటయ్యాయని డికాక్షన్ కో–ఫౌండర్ అద్దేపల్లి జయ కిరణ్ తెలిపారు. మొదటి 10 ఔట్‌లెట్లూ ఆర్టిస్టులవేనని చెప్పారు. ‘వృత్తిరీత్యా గాయకుడిని. కరోనా కారణంగా కార్యక్రమాలు లేక ఆర్థిక భారం మీద పడింది. ఆ సమయంలో వేడి పానీయాలకు డిమాండ్ ఉండడంతో వ్యవస్థీకృతంగా టీ వ్యాపారం ఎంచుకున్నాం. డికాక్షన్ తొలి కేంద్రం అక్టోబర్ 2020లో హైదరాబాద్ ఏర్పాటైంది. నేను, నా భార్య సంతోషి మూడు నెలలపాటు మా స్టోర్‌లో పనిచేశాం. తొలి 25 ఔట్‌లెట్లు 2021 మార్చి నాటికి, 50 సెంటర్స్ అక్టోబర్ కల్లా అందుబాటులోకి వచ్చాయి. మూడు నెలల్లోనే వీటికి 50 స్టోర్లు తోడవడం బ్రాండ్ పట్ల నమ్మకానికి నిదర్శనం’ అని వివరించారు.
డికాక్షన్ కో–ఫౌండర్స్ జయ కిరణ్, సంతోషి
100 ఔట్‌లెట్లు దాటిన డికాక్షన్
Published Thu, Feb 24 2022 4:59 AM | Last Updated on Thu, Feb 24 2022 4:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment