exceeds
-
బడ్జెట్ అంచనాలను మించి పన్ను వసూళ్లు!
న్యూఢిల్లీ: భారత్ పన్ను వసూళ్లు 2023 మార్చితో ముగిసే 2022–23 ఆర్థిక సంవత్సరంలో అంచనాలను మించి నమోదుకానున్నట్లు రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ వెల్లడించారు. లక్ష్యంకన్నా రూ.4 లక్షల కోట్ల అధిక వసూళ్లు జరగవచ్చని ఆయన తెలిపారు. భారీగా జరుగుతున్న ఆదాయపు పన్ను, కస్టమ్స్ సుంకాలు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు దీనికి కారణమని ఆయన అన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తెలిపిన అంశాలు... ► పన్ను రాబడిలో వృద్ధి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి కంటే ఎక్కువగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవస్థ పురోగతి దీనికి కారణం. ► 2022–23లో రూ.27.50 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రత్యక్ష పన్నుల వాటా రూ.14.20 లక్షల కోట్లయితే, పరోక్ష పన్ను వసూళ్ల వాటా రూ.13.30 లక్షల కోట్లు. ► అయితే లక్ష్యాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు, పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీ) వసూళ్లు రూ.14 లక్షల కోట్లకు చేరవచ్చు. అంటే వసూళ్లు రూ.31.50 లక్షల వరకూ వసూళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంచనాలకన్నా ఇది రూ.4 లక్షల కోట్ల అధికం. ► ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2022–23) సైతం పన్నుల లక్ష్యం మరింత పెద్దగా ఉండొచ్చు. ► పన్ను వసూళ్ల మదింపునకు మేము విస్తృత స్థాయిలో డేటాను ఉపయోగిస్తున్నాము. ఆదాయపు పన్ను, జీఎస్టీ విభాగాలు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) నుండి డేటాను ఎప్పుటికప్పుడు పొందుతున్నాము. సాంకేతికత అధికారికీకరణ అనుకూలతను మెరుగుపరచడంతో డేటాను సమగ్ర స్థాయిలో పొందగలుగుతున్నాము. ► 2020–21తో పోల్చితే 2021–22లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 50 శాతం పెరిగి, రూ.14.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ► ఈ ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాలు తగ్గించినప్పటికీ ప్రభుత్వం బడ్జెట్లో నిర్దేశించిన లక్ష్యానికి అతి చేరువలో ఉండడం హర్షణీయం. కస్టమ్స్, ఎక్సైజ్ సుంకాల ద్వారా వరుసగా రూ.2.13 లక్షల కోట్లు, రూ.3.35 లక్షల కోట్ల చొప్పున వసూళ్లు జరగాలన్నది బడ్జెట్ లక్ష్యం. ► ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్స్ 2021–22 ఆర్థిక సంవత్సరానికి (అసెస్మెంట్ ఇయర్) సంబంధించి ఇప్పటి వరకూ 6.85 కోట్లు దాఖలయ్యాయి. డిసెంబర్ 31 వరకూ తుది గడువు ఉండడంతో రిటర్న్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2021–22కిగాను ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్‌లు) దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉన్న కార్పొరేట్లు, ఇతరులకు తుది గడువు నవంబర్ 7. గడువు తప్పినట్లయితే, పన్ను చెల్లింపుదారులు జరిమానా చెల్లించడం ద్వారా ఆలస్యంగా కూడా రిటర్న్స్ దాఖలు చేయవచ్చు. దీనికి చివరి తేదీ డిసెంబర్ 31. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నవంబర్ 10 వరకూ రిఫండ్స్ విలువ (31 శాతం వృద్ధితో) రూ. 2లక్షల కోట్లు. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.10.54 లక్షల కోట్లుకాగా, రిఫండ్స్ పోను మిగిలిన మొత్తం రూ.8.54 లక్షల కోట్లు. వార్షిక బడ్జెట్ అంచనాల్లో ఈ విలువ 61.31 శాతానికి చేరింది. ► దేశంలో పలు రంగాలు మందగమనంలో ఉన్నప్పటికీ, ఎకానమీ పురోగతికి సంకేతమైన ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా పురోగమిస్తుండడం హర్షణీయ పరిణామం. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఎనిమిది నెలలుగా రూ.1.40 లక్షల కోట్లు పైబడ్డాయి. ఇందులో రెండు నెలలు రూ.1.50 లక్షల కోట్లు దాటాయి. కట్టడిలో ద్రవ్యలోటు చక్కటి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందని భావిస్తున్నాం. 2022–23లో ద్రవ్యలోటు రూ.16.61 లక్షల కోట్లుగా 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. -
100 ఔట్లెట్లు దాటిన డికాక్షన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీ, కాఫీ వంటి పానీయాల విక్రయంలో ఉన్న డికాక్షన్ 100 స్టోర్ల మైలురాయిని అధిగమించింది. కార్యకలాపాలు మొదలైన ఏడాదిన్నరలోపే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఏపీ, తెలంగాణలో 25 నగరాలు, పట్టణాల్లో 110 స్టోర్లున్నాయని డికాక్షన్ ఫుడ్స్, బెవరేజెస్ కో–ఫౌండర్ అద్దేపల్లి సంతోషి తెలిపారు. ఒక్కటి మినహా మిగిలిన కేంద్రాలన్నీ ఫ్రాంచైజీలవేనని చెప్పారు ‘ఏప్రిల్ నాటికి 130 ఔట్లెట్లు దాటతాం. కర్నాటక నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోనే 70 కేంద్రాలు ఉన్నా యి. ఫ్రాంచైజీల్లో ఏడుగురు మహిళలు ఉన్నారు. 80 లక్షల మందికిపైగా కస్టమర్లను సొంతం చేసుకున్నాం. మిల్క్ షేక్స్, థిక్ షేక్స్ వంటి పానీయాలూ విక్రయిస్తున్నాం. ప్రతి కేంద్రానికి 2–4 మందికి ఉపాధి లభిస్తోంది’ అని తెలిపారు. తొలుత ఫ్రాంచైజీ కేంద్రాలు.. సొంత స్టోర్ కంటే ముందే రెండు ఫ్రాంచైజీ కేంద్రాలు ఏర్పాటయ్యాయని డికాక్షన్ కో–ఫౌండర్ అద్దేపల్లి జయ కిరణ్ తెలిపారు. మొదటి 10 ఔట్‌లెట్లూ ఆర్టిస్టులవేనని చెప్పారు. ‘వృత్తిరీత్యా గాయకుడిని. కరోనా కారణంగా కార్యక్రమాలు లేక ఆర్థిక భారం మీద పడింది. ఆ సమయంలో వేడి పానీయాలకు డిమాండ్ ఉండడంతో వ్యవస్థీకృతంగా టీ వ్యాపారం ఎంచుకున్నాం. డికాక్షన్ తొలి కేంద్రం అక్టోబర్ 2020లో హైదరాబాద్ ఏర్పాటైంది. నేను, నా భార్య సంతోషి మూడు నెలలపాటు మా స్టోర్‌లో పనిచేశాం. తొలి 25 ఔట్లెట్లు 2021 మార్చి నాటికి, 50 సెంటర్స్ అక్టోబర్ కల్లా అందుబాటులోకి వచ్చాయి. మూడు నెలల్లోనే వీటికి 50 స్టోర్లు తోడవడం బ్రాండ్ పట్ల నమ్మకానికి నిదర్శనం’ అని వివరించారు. డికాక్షన్ కో–ఫౌండర్స్ జయ కిరణ్, సంతోషి -
అంచనాలను మించిన అమెరికా ఉద్యోగ వృద్ధి
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ జూలైలో గణనీయమైన ఉద్యోగ వృద్ధిని సాధించింది. ఇది మార్కెట్ అంచనాలకుమించి నమోదైంది. దీంతో నిరుద్యోగం రేటు 16 సంవత్సరాల కనిష్ఠానికి చేరింది. కార్మిక విభాగం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జులై నెలలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2లోల 9 వేల మేర పెరిగింది. ఇది 180,000 ఉండనుందని మార్కెట్ అంచనాను అధిగమించిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. మే నెలలో 145,000 గా కొత్త ఉద్యోగుల సంఖ్య జూన్ నెలలో 2, 31,000 కు చేరుకుది. మొత్తంగా ఈ రెండు నెలలో ఉద్యోగ లాభాలు గతంలో నివేదించిన దానికంటే 2,000 కన్నా అధికంగా ఉన్నాయి. నిరుద్యోగ రేటు జూన్నెలలో నమోదైన 4.4 శాతం నుంచి 4.3 శాతానికి దిగి వచ్చింది. జూలైలో, సగటు గంట ఆదాయాలు జూన్‌లోని 0.2 శాతం కంటే వేగంగా 0.3 శాతం వృద్ధితో 26.36 డాలర్లకు పెరిగింది. మరోవైపు ఫెడరల్ రిజర్వు రానున్న సెప్టెంబర్‌లో 4.5 లక్షల కోట్ల డాలర్ల బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించడానికి తన ప్రణాళికల రచిస్తోంది. దీనికి ఉద్యోగ వృద్ధి మార్గం సుగమం చేసిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం డిసెంబరులో ఫెడరల్ బ్యాంకు తన బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించనుదని చాలామంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. కాగా ఫెడ్ తదుపరి విధానం సమావేశం సెప్టెంబరు 19-20 న జరగనుంది. -
వేళలు పాటించకపోతే చర్యలు
ఏలూరు అర్బ¯ŒS: జిల్లాలో మద్యం దుకాణాలు నిర్ణీత వేళలు కచ్చితంగా పాటించాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ వైబీ భాస్కరరావు హెచ్చరించారు. బుధవారం జిల్లాలో ఆ శాఖ అధికారులు నిర్ణీతవేళలు పాటించని మద్యం దుకాణాలు, అనధికారికంగా మద్యం అమ్ముతున్న విక్రేతలపై దాడులు చేశారు. తాడేపల్లిగూడెం ఎక్సైజ్ స్టేష¯ŒS పరిధిలోని ఉత్తపాలెంలో అనధికారికంగా మద్యం అమ్ముతున్న దుకాణంపై దాడి చేశారు. నిందితుడి నుంచి క్వార్టర్ బాటిల్ మద్యం, 16 బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని డీసీ చెప్పారు.