చిన్నారికి ఐస్‌క్రీం తినిపిస్తోన్న రాహుల్ గాంధీ
భోపాల్ : మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాసేపు ప్రచారానికి విరామం ఇచ్చి సరదాగా గడిపారు. ఈ క్రమంలో రాహుల్ ఇండోర్‌లోని ‘56 దుకాణ్’ అనే షాప్‌లో ఐస్‌క్రీం తినేందుకు వచ్చారు. రాహుల్ కోసం అక్కడి సిబ్బంది ప్రత్యేక ఐస్‌క్రీంను తయారుచేసి ఇచ్చారు. దాన్ని తీసుకుని తినడానికి సిద్ధమైన రాహుల్.. అక్కడే ఉన్న ఓ చిన్నారిని గమనించారు. ‘హలో.. ఐస్‌క్రీం తింటావా’? అంటూ ప్రశ్నించి ఆ బాలునికి ఐస్ క్రీం తినిపించారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ తన అధికారిక ట్విటర్‌లో పోస్టు చేసింది. ఈ సమయంలో రాహుల్ వెంట కాంగ్రెస్ నేతలు కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింథియా తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment