ఐస్‌క్రీం కావాలా నాయనా..! | special ice cream in japan | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీం కావాలా నాయనా..!

Jul 1 2018 3:04 AM | Updated on Jul 1 2018 3:04 AM

special ice cream in japan - Sakshi

వర్షం పడుతుంటే ఎంచక్కా ఐస్‌క్రీం తింటూ పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా ఎంజాయ్‌ చేస్తుంటారు. ఏదైనా ఐస్‌క్రీం దుకాణానికి వెళ్లి కోన్‌ ఐస్‌క్రీమో ఆర్డర్‌ ఇచ్చారనుకోండి. ఓ బుర్రలో ఐస్‌క్రీం పెట్టి ఇస్తాడు అంతేకదా.. అలా కాకుండా కొంత వైవిధ్యంగా ఐస్‌క్రీం తినాలనుకుంటే చక్కగా జపాన్‌ వెళ్లిపోవాల్సిందే. అక్కడి మియాజకీ ప్రిఫెక్చర్‌ అనే ప్రాంతలో ఉన్న హ్యాకుషో ఉడాన్‌ అనే ఐస్‌క్రీం దుకాణాన్ని సందర్శించాల్సిందే.

విభిన్న రుచులు ఉన్న వారు ఇక్కడికి ఒక్కసారైనా వెళ్లాల్సిందే. ఎందుకంటే ఫొటోలో చూశారు కదా ఐస్‌క్రీం ఎంత పెద్దగా ఉందో.. ఇక్కడ హాయిగా కూర్చుని స్పూన్‌తో ఐస్‌క్రీం తినడం దాదాపు అసాధ్యం. అంతేకాదు తినేటప్పుడు ఎక్కడ కిందపడిపోతుందోనని.. తొందరగా తినకపోతే ఎక్కడ కరిగిపోతుందోనన్న టెన్షన్‌ ఇందుకు అదనం! ఇలా వెరైటీగా ఉన్న ఐస్‌క్రీంను తినేందుకు అక్కడి జనం బారులు తీరుతున్నారట.

వివిధ రంగుల్లో కూడా ఈ ఐస్‌క్రీంను అందిస్తారు ఇక్కడి యజమానులు. అంతెత్తు ఐస్‌క్రీం వద్దనుకునే వారికి కాస్త తక్కువ ఎత్తు ఉన్నవి కూడా సర్వ్‌ చేస్తారు. ఇంత ఫేమస్‌ అయిన ఈ ఐస్‌క్రీం ఖరీదెంతో తెలుసా రూ.362 మాత్రమే. అంత పెద్ద ఖరీదేం కాదు కదా.. ఎప్పుడైనా మీకు జపాన్‌ వెళ్లే అవకాశం వస్తే ఈ ఐస్‌క్రీం తినడం మానకండి మరి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement