ఐస్‌క్రీమ్ ఇప్పిస్తానంటూ ఇంట్లోకి పిలిచి.. | abhinay harassment on girl | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీమ్ ఇప్పిస్తానంటూ ఇంట్లోకి పిలిచి..

Nov 29 2014 2:10 AM | Updated on Apr 3 2019 4:43 PM

నగరంలోని సంతపేటలో ఓ ప్రైవేట్ స్కూలులో చదువుతున్న బాలిక పట్ల ఓ యువకుడు శుక్రవారం మధ్యాహ్నం అసభ్యంగా ప్రవర్తించాడు.

 ఒంగోలు క్రైం : నగరంలోని  సంతపేటలో ఓ ప్రైవేట్ స్కూలులో చదువుతున్న బాలిక పట్ల ఓ యువకుడు శుక్రవారం మధ్యాహ్నం అసభ్యంగా ప్రవర్తించాడు. సభ్యసమాజం తల దించుకునేలా వ్యవహరించిన అతడు బీటెక్ పూర్తి చేశాడు. ఓ జిల్లాస్థాయి ఉన్నతాధికారికి స్వయానా తమ్ముడు కుమారుడైన యూ.అభినయ్ తూర్పుగోదావరి జిల్లా గన్నవరానికి చెందినవాడు. ఒంగోలు తన పెదనాన్న వద్దకు వచ్చాడు. ఇంటి ముందుగా వెళ్తున్న ఏడేళ్ల చిన్నారిని ఐస్‌క్రీమ్ ఇప్పిస్తానంటూ ఇంట్లోకి పిలిచాడు. అభంశుభం తెలియని ఆ చిన్నారి ఐస్‌క్రీమ్ కోసం ఆశ పడి ఇంట్లోకి వెళ్లింది.

అతడి వికృత చేష్టలకు బిత్తరపోయింది. పెద్దగా అరవాలని ప్రయత్నించగా బాలిక నోరు తన చేతులతో నొక్కి పట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం భోజనానికి రాలేదేంటా.. అని ఆ చిన్నారి తల్లి ఇంతలో స్కూలు వద్దకు వచ్చింది. స్కూలు యాజమాన్యాన్ని తన కుమార్తె విషయం అడిగింది. స్కూలు వదలగానే ఇంటికి వచ్చిందంటూ నిర్వాహకులు సమాధానమిచ్చారు. ఇంటికి రాలేదని చెప్పటంతో ఆ చిన్నారిని అందరూ కలిసి వెతుకులాట ప్రారంభించారు. ఒంగోలు టూటౌన్ బ్లూకోట్స్ టీమ్‌కు సమాచారం అందించారు. ఎం.రామకృష్ణ (ఆర్‌కే), సుబ్బారావుతో కూడిన బ్లూకోట్స్ టీమ్ స్కూలు వద్దకు చేరుకుంది.

బాలిక ఇంటికి స్కూల్‌కు మధ్యలో ఉన్న ఇళ్లన్నీ వెతుకుతున్నారు. ఒక ఇంట్లో నుంచి చిన్నారి అరుపులు వినబడటంతో బ్లూకోట్స్ టీమ్ వెళ్లింది. బాలికను వదిలేసి అభినయ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే బ్లూకోట్స్ పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఈలోగా పరిసర ప్రాంతాల వారు అతనిపై దాడికి దిగారు. అప్పటికే ఆ బాలిక తల్లితో పాటు పలువురు మహిళలు అతడిని చితకబాదారు. టూటౌన్ సీఐ వి.సూర్యనారాయణకు చేరవేయటంతో తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన అభినయ్‌ను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు వాహనంలో తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement