Abhinay
-
భారీ విస్తరణ దిశగా కిమ్స్..
• ఫిబ్రవరికల్లా ఒంగోలు ఆసుపత్రి పూర్తి • మరో మూడు రాష్ట్రాల్లోనూ ఏర్పాటు • కొత్తగా 4,000 మంది నియామకం • కిమ్స్ వైస్ ప్రెసిడెంట్ అభినయ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న కిమ్స్ హాస్పిటల్స్... ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలులో ఫిబ్రవరినాటికి 300 పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తేనున్నట్లు తెలియజేసింది. రూ.60 కోట్లతో ఒంగోలులో ఈ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కొండాపూర్‌లోని 100 పడకల ఆసుపత్రికి ఇటీవలే రూ.40 కోట్ల ఖర్చుతో మరో 100 పడకలను జోడించారు. కొండాపూర్ ప్రాంతంలో నాణ్యమైన వైద్య సేవలకు డిమాండ్ పెరిగిందని, అందుకే విస్తరణ చేపట్టామని కిమ్స్ హాస్పిటల్స్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్ అభినయ్ బొల్లినేని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ‘‘ఇంకా గువహటి, భువనేశ్వర్, ఇండోర్ నగరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని నిర్ణయించాం. ఇవి ఒక్కొక్కటి 250 పడకల సామర్థ్యంతో వస్తాయి. ఈ మూడు సెంటర్లకు రూ.450 కోట్ల దాకా వెచ్చిస్తాం. 2018 చివరికల్లా నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని అభినయ్ వివరించారు. ప్రస్తుతం సంస్థ వద్ద అన్ని విభాగాల్లో కలిపి 7,000 మందికిపైగా పని చేస్తున్నారు. ప్రతిపాదిత విస్తరణ పూర్తయితే ఈ సంఖ్య 11,000 దాటుతుందని ఆయన వెల్లడించారు. కిమ్స్‌కు తెలంగాణలో సికింద్రాబాద్, కొండాపూర్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళంలో ఆసుపత్రులున్నాయి. వీటి సామర్థ్యం 2,200 పడకలు. శ్రీకాకుళంలోని మెడికల్ కళాశాలకు అనుబంధంగా 500 పడకల ఆసుపత్రి ఉంది. -
ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌లో అభినయ్(16) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వివాహం చేసుకున్న తల్లిదండ్రులను అమ్మమ్మ, తాతయ్య ప్రేమతో చేరదీయడలేదని మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘సహన’ తలరాత మారుద్దాం
హైదరాబాద్: అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సహన తలరాతను మార్చేందుకు మేమున్నామంటూ వేలాది హృదయాలు ముందుకొచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల్లోని తెలుగువారు స్పందించడమే కాక.. చేతనైనంత సాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. సికింద్రాబాద్ మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన చిన్నారి సహనతోపాటు ఆమె కుటుంబ సభ్యులు పడుతున్న బాధలపై ‘తలరాతను మార్చుదాం’ శీర్షికతో ‘సాక్షి’ బుధవారం ప్రచురించిన కథనానికి విశేష స్పందన లభించింది. చిన్నారి సహన మోస్తున్న భారాన్ని తగ్గించేందుకు తమ వంతు బాధ్యతగా వేలాది చేతులు ఆపన్నహస్తం అందించాయి. ఆర్థికంగానేకాక మాట సాయం అందించి సహన కుటుంబానికి భరోసా కల్పించారు. హృదయాలను కదిలించే సహన కథనాన్ని మానవీయ కోణంలో ప్రచురించిన ‘సాక్షి’ యాజమాన్యానికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. అండగా నేనున్నా..: కేటీఆర్ చిన్నారి సహన కథనాన్ని చదవి రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు చలించిపోయారు. బాధిత కుటుంబానికి అండగా తానుంటానని భరోసా ఇచ్చారు. బుధవారం ఫోన్ ద్వారా బాధిత కుటుంబ సభ్యులతో మంత్రి కార్యాలయ సిబ్బంది మాట్లాడారు. త్వరలోనే చిన్నారి సహనను స్వయంగా కలుస్తానని మంత్రి తెలిపారని, వైద్య చికిత్సల కోసం సీఎం సహాయనిధి నుంచి నిధుల మంజూరుకు చర్యలు చేపట్టాలని తమను అదేశించారని మంత్రి పీఏ తెలిపారు. కేటీఆర్ కార్యాలయ సిబ్బంది తమతో మాట్లాడి, భరోసా కల్పించడంపై సహన నాయనమ్మ లక్ష్మమ్మ హర్షం వ్యక్తం చేసింది. ఉచితంగా వైద్య సేవలు అందిస్తాం.. సహనకు అవసరమైన వైద్య సేవలను ఉచితంగా అందించేందుకు తిరుపతికి చెందిన రమాదేవి ఆస్పత్రి ముందుకొచ్చింది. ఆస్పత్రి ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా సహన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాజమండ్రి ప్రాణజ్ఞాన వైద్యాలయం ప్రతినిధి శిరీష మాట్లాడుతూ ఎటువంటి రుసుము లేకుండా ఆకుపసరు వైద్యంతో సహన సమస్యను పరిష్కరిస్తామన్నారు. సహన వైద్య సేవల నిమిత్తం ప్రతి నెలా రూ. 10 వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని గుంటూరు మదర్ థెరిసా ట్రస్ట్ ప్రతినిధి సాంబశివరావు తెలిపారు. సహన కుటుంబ సభ్యులు అంగీకరిస్తే ఆమె అక్కాచెల్లెళ్లను దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివిస్తామని హైదరాబాద్‌కు చెందిన సర్వనీడీ ఫౌండేషన్ ముందుకొచ్చింది. వారం రోజుల కూలి డబ్బును తన వంతు సాయంగా అందిస్తానని శ్రీకాకుళం నరసన్నపేటకు చెందిన కూలి నాగరాజు చెప్పాడు. హృదయాలను కదిలిచింది.. ‘సాక్షి’ వెబ్‌పోర్టల్‌లో సహన కథనం చదవి పలువురు ఆర్థిక సాయం అందించారు. కాలిఫోర్నియాలో ఉంటున్న కమలాకర్, ఆస్ట్రేలియాలో ఉంటున్న రాజేష్, చైనాలో ఉంటున్న ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన రమేష్ బ్యాంకు ద్వారా ఆర్థిక సాయం అందించారు. మరోవైపు చిన్నారి సహన సమక్షంలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించనున్నట్లు మహేష్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధి అభినయ్ తెలిపారు. -
ఐస్‌క్రీమ్ ఇప్పిస్తానంటూ ఇంట్లోకి పిలిచి..
ఒంగోలు క్రైం : నగరంలోని సంతపేటలో ఓ ప్రైవేట్ స్కూలులో చదువుతున్న బాలిక పట్ల ఓ యువకుడు శుక్రవారం మధ్యాహ్నం అసభ్యంగా ప్రవర్తించాడు. సభ్యసమాజం తల దించుకునేలా వ్యవహరించిన అతడు బీటెక్ పూర్తి చేశాడు. ఓ జిల్లాస్థాయి ఉన్నతాధికారికి స్వయానా తమ్ముడు కుమారుడైన యూ.అభినయ్ తూర్పుగోదావరి జిల్లా గన్నవరానికి చెందినవాడు. ఒంగోలు తన పెదనాన్న వద్దకు వచ్చాడు. ఇంటి ముందుగా వెళ్తున్న ఏడేళ్ల చిన్నారిని ఐస్‌క్రీమ్ ఇప్పిస్తానంటూ ఇంట్లోకి పిలిచాడు. అభంశుభం తెలియని ఆ చిన్నారి ఐస్‌క్రీమ్ కోసం ఆశ పడి ఇంట్లోకి వెళ్లింది. అతడి వికృత చేష్టలకు బిత్తరపోయింది. పెద్దగా అరవాలని ప్రయత్నించగా బాలిక నోరు తన చేతులతో నొక్కి పట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం భోజనానికి రాలేదేంటా.. అని ఆ చిన్నారి తల్లి ఇంతలో స్కూలు వద్దకు వచ్చింది. స్కూలు యాజమాన్యాన్ని తన కుమార్తె విషయం అడిగింది. స్కూలు వదలగానే ఇంటికి వచ్చిందంటూ నిర్వాహకులు సమాధానమిచ్చారు. ఇంటికి రాలేదని చెప్పటంతో ఆ చిన్నారిని అందరూ కలిసి వెతుకులాట ప్రారంభించారు. ఒంగోలు టూటౌన్ బ్లూకోట్స్ టీమ్‌కు సమాచారం అందించారు. ఎం.రామకృష్ణ (ఆర్కే), సుబ్బారావుతో కూడిన బ్లూకోట్స్ టీమ్ స్కూలు వద్దకు చేరుకుంది. బాలిక ఇంటికి స్కూల్‌కు మధ్యలో ఉన్న ఇళ్లన్నీ వెతుకుతున్నారు. ఒక ఇంట్లో నుంచి చిన్నారి అరుపులు వినబడటంతో బ్లూకోట్స్ టీమ్ వెళ్లింది. బాలికను వదిలేసి అభినయ్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే బ్లూకోట్స్ పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఈలోగా పరిసర ప్రాంతాల వారు అతనిపై దాడికి దిగారు. అప్పటికే ఆ బాలిక తల్లితో పాటు పలువురు మహిళలు అతడిని చితకబాదారు. టూటౌన్ సీఐ వి.సూర్యనారాయణకు చేరవేయటంతో తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన అభినయ్‌ను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు వాహనంలో తరలించారు. -
చాటింగ్ గీతాలు
అభినయ్‌కృష్ణ, సునీత జంటగా.. టీఎస్ కమల్ దర్శకత్వంలో లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘చాటింగ్’. జయంత్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నాగబాబు ఆడియో సీడీని ఆవిష్కరించి, మంత్రి రుద్రరాజు పద్మరాజుకి అందించారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. హీరో అభినయ్ ఈ సినిమాకోసం ఎన్నో సాహసాలు చేశాడని దర్శకుడు అభినందించారు. ఇంకా నిర్మాత అశోక్‌కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.