న్యూఢిల్లీ: హావ్‌మోర్ ఐస్‌క్రీమ్ కంపెనీ (హెచ్‌ఐఎల్) తన ఐసీక్రీమ్ వ్యాపారాన్ని దక్షిణ కొరియాకు చెందిన లాటే కన్ఫెక్షనరీకి విక్రయించనున్నది. ఈ డీల్ విలువ రూ.1,020 కోట్లు. ఈ డీల్‌లో భాగంగా హెచ్‌ఐఎల్‌కు చెందిన వంద శాతం షేర్లను లాట్టే కంపెనీ కొనుగోలు చేయనున్నది. ఈ విక్రయం తర్వాత లాట్టే కంపెనీ తన ఐస్‌క్రీమ్ వ్యాపారాన్ని భారత మార్కెట్లో ప్రారంభించనున్నది. హావ్‌మోర్ ఐస్‌క్రీమ్‌ను గత 73 ఏళ్లుగా మంచి బ్రాండ్‌గా తీర్చిదిద్దామని హెచ్‌ఐఎల్ చైర్మన్ ప్రదీప్ చోనా చెప్పారు. తమ బ్రాండ్‌ను తర్వాతి స్థాయికి తీసుకెళ్లే సరైన సంస్థ లాటేనని పేర్కొన్నారు.
అహ్మదాబాద్ కేంద్రంగా హావ్‌మోర్ కంపెనీ ఐస్‌క్రీమ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఈ కంపెనీకి మొత్తం 14 రాష్ట్రాల్లో పార్లర్ నెట్‌వర్క్ ఉంది. మొత్తం రెండు ప్లాంట్ల ద్వారా 150 రకాల ఐస్‌క్రీమ్‌లను 30 వేల డీలర్ల ద్వారా విక్రయిస్తోంది. ఇక 8,000 కోట్ల డాలర్ల లాట్టే కన్ఫెక్షనరీ 2004లో భారత్‌లో ప్రవేశించింది. చెన్నై, ఢిల్లీలో చాకో–పై ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసింది. ప్రస్తుత భారత చాకో–పై మార్కెట్లో కంపెనీ వాటా 90 శాతంగా ఉంది. కాగా, గుజరాత్‌లోని హ్యుబర్ అండ్ హోలీ పేరుతో నిర్వహిస్తున్న రెస్టారెంట్, ఈటరీ, కేఫ్ చెయిన్ నిర్వహణను హావ్‌మోర్ కొనసాగిస్తుంది. ఈ డీల్‌కు కేపీఎమ్‌జీ, వెరిటాస్ లీగల్, ధ్రువ ట్యాక్స్ కన్సల్టెంట్స్ ఆర్థిక సలహాదారులుగా వ్యవహరించాయి.
Comments
Please login to add a commentAdd a comment