ఇంటిప్స్
అరటిపండు త్వరగా మగ్గిపోకుండా, క్రిములు లోపలికి వెళ్లకుండా ఉండాలంటే ముచ్చిక దగ్గర ప్లాస్టిక్ కవర్ చుట్టాలి.
♦ ఐస్‌క్రీమ్ డబ్బాను ప్లాస్టిక్ కవర్‌లో వేసి, చుట్టి డీప్‌ఫ్రిజ్‌లో ఉంచితే అడుగున అతుక్కుపోదు. ఐస్‌క్రీమ్ కూడా మరీ గట్టిగా కాకుండా స్పూన్‌తో తీసుకోవడానికి వీలుగా ఉంటుంది.
♦ కప్పు నీళ్లు, టేబుల్ స్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ బేకింగ్ సొడా స్ప్రే బాటిల్‌లో పోసి షేక్ చేయాలి. పండ్లు, కూరగాయల మీద స్ప్రే చేసి, పది నిమిషాల తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. రసాయనాల గాఢత తగ్గుతుంది. క్రిములు నశిస్తాయి.