
టెక్సాస్(అమెరికా): షాప్‌లోకి వెళ్లి దొంగతనంగా ఐస్‌క్రీమ్ చప్పరించి... దానిని మళ్లీ ఫ్రిజ్‌లో పెట్టి ఆకతాయి చర్యకు పాల్పడ్డ అమ్మాయిని అమెరికా పోలీసులు గుర్తించారు. జూన్ 29న టెక్సాస్‌లోని స్థానిక వాల్‌మార్ట్ షాప్‌లోకి వెళ్లిన సదరు యువతి ఫ్రిజ్ నుంచి బ్లూ బెల్లా ఐస్‌క్రీమ్ టబ్ మూత తీసి ఐస్‌క్రీమ్‌ను చప్పరించి...తిరిగి యథాస్థానంలో పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేయడంతో పాటు ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ట్రోల్ చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు యువతి ఆచూకి కోసం చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శాన్ ఆంటోనియో ప్రాంతానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. కాగా ఆ అమ్మాయి మైనర్ అయినందున ఆమె పూర్తి వివరాలను వెల్లడించబోమని పోలీసులు తెలిపారు. అయితే ఆమెపై కేసు మాత్రం నమోదు చేస్తామని వెల్లడించారు. కాగా ఇలాంటి చర్యలకు పాల్పడితే సాధారణంగా 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని.. ఇక ముందు ఎవరూ ఇటువంటి ఆకతాయి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు.
చదవండి : ఛీ..యాక్.. ఇంత వికృతమా!