
యాంకర్ సుమ తన మాటలతో, విసిరే పంచ్‌లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలోనూ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసి నెటిజన్లను అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె పోస్టు చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇటీవల ఆమె ఐస్‌క్రీమ్ తింటూ వీడియో సుమ తీసుకుంది. అది సాధారణ ఐస్‌క్రీమ్ కాదని, ప్రత్యేకమైందని తెలుస్తోంది. ఎందుకంటే అది తినేటప్పుడు నోట్లో నుంచి, ముక్కులో నుంచి పొగలు రావాల్సిందేనట.
ఆ సమయంలో సుమ తనదైన శైలిలో హావభావాలు ఒలకిస్తూ, ఐస్‌క్రీమ్ రుచిన ఆస్వాదించింది. ఈ వీడియోలో ఐస్‌క్రీమ్ తింటూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తోంది సుమ. అంతేకాక ఓ డ్రాగన్ వదిలే శ్వాసలా పొగ వస్తుందని ఆమె పేర్కొంది. ఫేస్‌బుక్‌లో సుమకు దాదాపు మూడు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment