పెద్దయ్యాకా ఐస్‌క్రీమ్ ఎందుకు వద్దనమంటే...
న్యూయార్క్: ఐస్‌క్రీమంటే కేవలం చిన్నపిల్లలు మాత్రమే ఇష్టపడతారా? అదేంలేదు... పెద్దోళ్లు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. దీనికి కారణమేంటి? అనే విషయమై జరిగిన అధ్యయనంలో ...అంతా ప్రచారం ప్రభావమేనని తేలింది. ‘సాధారణంగా బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలో రకరకాల ఆహారపదార్థాలవైపు మనిషి మళ్లుతుంటాడు.
ఈ సమయంలో పత్రికలు, టీవీలు, ఇతర మీడియాలో వచ్చే ఆహార పదార్థాలపై మక్కువ పెంచుకుంటాడు. ఈ ప్రకటనల్లో మొదటిస్థానం ఐస్‌క్రీమ్‌దే. ఇవి పిల్లలతోపాటు యువతనూ అమితంగా ఆకర్షించేలా ఉంటాయి. దీంతో మనసులో ఐస్‌క్రీమ్ బలంగా నాటుకుంటుంది. అందుకే పెద్దయ్యాక కూడా అతను అలవాటును ఎప్పటికీ మానుకోలేకపోతాడ’ని పరిశోధకులు తేల్చారు.