పెదగంట్యాడ: హట్ సమ్మర్ ఎఫెక్ట్ మార్చి నుంచే మూర్చపోయే రేంజ్‌లో స్టార్ట్ అయింది. 40 డిగ్రీస్‌లో శరీరం ఉక్కపోతతో ఆపసోపాలు పడే చిరుద్యోగుల నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల వరకూ సేదతీరే ప్రాంతాల కోసం ఆరాటంగా ఎదురు చూస్తుంటారు. కూలింగ్ రీఫ్రెష్‌మెంట్ అందరికీ అవసరమే. రేంజ్‌ను బట్టి సర్వీస్.. దానికి తగ్గట్టు ట్రీట్‌మెంట్. నగరంలో కొన్ని రీఫ్రెష్.. లేటెస్ట్ ఐటెమ్స్ మనకోసం ఎదురు చూస్తున్నాయి.
ఫ్రైడ్ ఐస్‌క్రీమ్
వేయించిన ఐస్‌క్రీమ్ కొత్తగా ఉన్నా.. ఇది నిజంగానే వైజాగ్‌లో అందుబాటులో ఉంది. మనకు నచ్చిన ఫ్లేవర్ ఐస్‌క్రీంను కొన్ని ప్రత్యేక పౌడర్లు, పదార్థాలతో కలిపి నూనెలో అలా వేసి ఇలా తీసేస్తారు. దీన్ని టేస్ట్ చేయాలనుకుంటే ద్వారకానగర్‌లోని కొక్కొరోకో రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే. ఓ సారి ట్రై చేస్తే పోలే..
వెనిల్లా ఐస్‌క్రీమ్‌తో కోకోకోలా డ్రింక్ మిక్స్ చేసి డిఫరెంట్ టేస్ట్ కావాలంటే వీఐపీ రోడ్‌లోని చిలౌట్ ఐస్‌క్రీమ్ షాపుకు వెళ్లండి. ఫ్రెష్ ఫ్రూట్స్ ఐస్‌క్రీమ్ కేక్‌లాగా మార్చి తినాలనుకుంటే డైమండ్ పార్క్ దగ్గరున్న స్నోడ్యూన్స్‌కి వెళ్లండి. ఇంకా రకరకాల వెరైటీ ఫుడ్స్ సమ్మర్‌లో చాలానే ఉన్నాయి. కోల్డ్ కాఫీ కూడా చాలా ఎక్కువ మంది యూత్ ప్రిఫర్ చేస్తున్నారు. బీచ్‌రోడ్‌లో చాక్లెట్ రూమ్‌లో బ్లాక్ చాక్లెట్‌తో చేసే వెరైటీ ఐటెమ్స్‌కు గిరాకీ ఎక్కువ. రోడ్ సైడ్‌లో ఉండే చిన్న చిన్న ఐస్‌క్రీమ్ షాప్‌లు, జ్యూస్ పాయింట్ల సైతం సమ్మర్ స్పెషల్ ఐటెమ్స్‌తో ఆకర్షిస్తున్నాయి. తక్కువ ధరల్లో వీఐపీ ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి రకరకాల షాప్‌లు రెడీగా ఉన్నాయి.