జాధవ్
ముంబై : ఎమ్‌ఆర్‌పీ రేటు కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసిన ఓ రెస్టారెంట్‌కు షాక్ తగిలింది. 10 రూపాయల కోసం కక్కుర్తి పడితే ఏకంగా 2,45,000 రూపాయలు హాంఫట్ అయింది. ఈ సంఘటన ముంబైలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ భాస్కర్ జాధవ్ 2014, జూన్ 8న కూతురితో కలిసి అక్కడి షగుణ్ వెజ్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఫ్యామిలీ ప్యాక్ ఐస్‌క్రీమ్ ఆర్డర్ చేశాడు. బేరర్ ఐస్‌క్రీమ్ తెచ్చిచ్చిన తర్వాత అతడికి 175 రూపాయలు చెల్లించాడు. ( పుట్టిన శిశువు ఆడ, మగ కాకపోయినా సరే..)
ఈ నేపథ్యంలో ఎక్సైరీ డేట్ కోసం ఐస్‌క్రీమ్‌ను తరచి చూడగా ఎమ్‌ఆర్‌పీ రేటు 165 రూపాయలు కనిపించింది. ఇదే విషయం హోటల్ యజమాన్యాన్ని అడిగి, మిగిలిన చిల్లర వెనక్కు ఇవ్వమని కోరాడు. వారు డబ్బులు ఇవ్వకపోగా అది కూలింగ్ ఛార్జ్ అని చెప్పారు. దీంతో ఆగ్రహించిన జాధవ్ కోర్టులో ఫిర్యాదు చేశాడు. ఐదేళ్ల తర్వాత తాజాగా తీర్పు చెప్పిన కోర్టు సదరు హోటల్‌కు భారీ మొత్తంలో ఫైన్ వేసింది.
Comments
Please login to add a commentAdd a comment