
పుల్లకు అతుక్కుపోయిన బల్లి , ఐస్‌క్రీం బాక్స్
సాక్షి, లేపాక్షి (అనంతపురం): మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన కుమారస్వామి గురువారం ఉదయం పుల్లయిసు కొనుక్కున్నాడు. కొంచెం తినగానే పుల్లకు అతుక్కుపోయిన బల్లి కనిపించింది. ఇది పుల్లనా, బల్లినా అని చూసుకోకుండా ఐస్ తయారు చేస్తారా అంటూ గ్రామస్తులు ఐస్ బండి తీసుకొచ్చిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకేమీ తెలియదని, హిందూపురంలోని తిరుమల ఐస్‌క్రీం కంపెనీవాళ్ల దగ్గర కొనుగోలు చేసి అమ్ముకుంటూ బతుకుతున్నానని ఆ వ్యక్తి విచారం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment