
ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు: కడుపునొప్పితో తీవ్రంగా బాధపడుతున్న వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. సర్జరీ చేసి చూడగా.. కడుపులో బంగారు చెవి దుద్దులు, చేతి ఉంగరాలున్నాయి. ఆశ్చర్యపోయిన వైద్యులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఓ బంగారం దుకాణంలో వీటిని దొంగతనం చేశానని.. పోలీసులకు బయపడి ఐస్‌క్రీంతో పాటు వీటిని కూడా మింగేశానని వెల్లడించాడు. ఆ వివరాలు..
దక్షిణ కర్ణాటక కసాబా గ్రామానికి చెందిన శిబుకు చిన్న చిన్న దొంగతనాలు చేసే అలవాటు ఉంది. ఈ క్రమంలో రెండు వారాల క్రితం శిబు ఓ బంగారం దుకాణంలో సుమారు 35 గ్రాముల బంగారు ఉంగరాలు, చెవి దుద్దులు దొంగతనం చేశాడు. వాటిని బయటకు కనిపించకుండా ఉంచడం కోసం ఐస్‌క్రీంతో పాటు మింగేశాడు.
అయితే శిబు గంతలో కూడా ఇలానే చేసేవాడట. చిన్న చిన్న బంగారు ఆభరణాలు దొంగతనం చేశాక అనుమానం వచ్చి.. పోలీసులకు చిక్కితే.. దొంగిలించిన నగలు వారికి కనిపించకుండా ఉండటం కోసం మింగేసేవాడట. ఈ సారి కూడా అలానే చేశాడు. కాకపోతే తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.