Tomatoes Worth Rs 2.5 Lakh Stolen From A Farmer In Karnataka As Price Hits Roof - Sakshi
Sakshi News home page

Tomatoes Stolen In Karnataka: కొండెక్కిన ధరలు.. తోట నుంచి రూ. 2.5 ల‌క్ష‌ల విలువ చేసే ట‌మాట చోరీ

Published Thu, Jul 6 2023 3:26 PM | Last Updated on Thu, Jul 6 2023 4:08 PM

Tomatoes worth Rs 2 5 lakh stolen in Karnataka As Price Hits Roof - Sakshi

మార్కెట్లో కూరగాయాల ధరలు ప్రజలను ఠారేత్తిస్తున్నాయి. ఏకంగా సామాన్యులు కొనలేని స్థాయికి ఎగబాకాయి ధరలు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా టమాట ధరలు చుక్కలనంటుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాట రూ.120 పైనే పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి ధరలు ఇంకా ఎక్కువే ఉన్నాయి.

అడ్డగోలు ధరలతో టమాట దొంగతనాలకు పాల్పడుతున్నారు దుండగులు. మార్కెట్లో, దుకాణాల్లో నిల్వ చేసిన వాటితోపాటు ఏకంగా తోటలో నుంచి సైతం టమాటలను సైతం చోరీ అవుతున్నాయి. టమాటా తోటకు ఓ రైతు ఏకంగా సీసీ కెమెరా ఏర్పాటు చేశాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజాగా కర్ణాటకలో ఇలాంటి ఉదంతమే వెలుగు చూసింది. ఓ రైతు చేనులో నుంచి రూ. 2.5 లక్షల విలువైన టమాలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ ఘటన హసన్‌ జిల్లాలోని సోమ‌న‌హ‌ళ్లి గ్రామం మంగళవారం జరిగింది.  
చదవండి: 12 పెళ్లిచూపులు..కట్నం ఇవ్వనందుకు సంబంధం క్యాన్సిల్‌

అప్పు తీసుకొని మరీ తనకున్న రెండు ఎకరాల భూమిలో టమాట పంట సాగు చేస్తున్నట్లు మహిళా రైతు ధరణి తెలిపింది. ప్రస్తుతం టమాట ధర బెంగుళూరులో కిలో రూ.120 పలుకుతుండటంతో టమాట పంటను కోసి మార్కెట్‌కు తరలించాలని అనుకున్నట్లు చెప్పింది. కానీ మంగళవారం రాత్రే టమాట తోటలో దొంగలు పడ్డారని, 50-60  బ్యాగుల టమాటాను దొంగిలించారని వాపోయింది. ఈ ట‌మాటా విలువ రూ. 2.5 ల‌క్ష‌లు ఉంటుంద‌ని మ‌హిళా రైతు ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అంతేగాక మిగిలిన పంటనుకూడా దొంగలు ధ్వంసం చేశారని ఆమె పేర్కొంది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు హలబీడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

కాగా గడిచిన నెలలో ఎండల తీవ్రతోపాటు అకాల వర్షాలతో పంట దెబ్బతినడంతో టమాట దిగుబడి తగ్గిపోయింది పోయింది. ఇతరప్రాంతాల నుంచి రవాణా తగ్గిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. ధరలు ఎగబాకుతుండటంతో రైతులకు గిట్టుబాటు అవుతుండగా.. వినియోగదారులను బెంబేలెత్తిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో టమాట ధర 129 రూపాయలు ఉండగా ఉత్తరప్రదేశ్‌లోని మోరదాబాద్‌లో రూ. 150కు చేరింది. పెరిగిన ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ప్రభుత్వాలు సబ్సిడీకి అందించాలని కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement