
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): దేశవ్యాప్తంగా టమాటకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కేజీ రూ.200తో విక్రయిస్తున్నారు. దీంతో ఆ పంటపై దొంగల కన్ను పడింది. రాత్రికి రాత్రే పంటను దోచుకెళ్తున్నారు. దొడ్డ తాలూకా లక్ష్మిదేవపురం గ్రామంలో రైతు జగదీష్ తన ఎకరా భూమిలో టమాట సాగు చేశాడు.
మంచి దిగుబడితోపాటు ధరలు పెరగడంతో తన కష్టాలు తీరుతాయని సంబరపడ్డాడు. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు మిగలలేదు. ఎందుకంటే మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పొలంలోకి చొరబడి టమాట కాయలు తెంపుకొని ఉడాయించారు. బుధవారం ఉదయం తోటకు వెళ్లిన జగదీష్ చెట్లు ఖాళీగా కనిపించడంతో అవాక్కయ్యాడు. చోరీకి గురైన టమాట విలువ రూ.1.50లక్షలు చేస్తుందని రైతు తెలిపాడు.
చదవండి: Delhi Rains: ఢిల్లీలో జల ప్రళయం.. యమునా ఉధృతరూపం.. నగర చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు