
‘డ్యాన్స్ చేయండి. ఐస్‌క్రీమ్ ఫ్రీగా తినండి’ అని ఎవరైనా ఆఫర్ ఇస్తే ఎంత బాగుంటుంది!
ఎవరో ఎందుకు సాక్షాత్తూ ఒక ఐస్‌క్రీమ్ కంపెనీ ఇలాంటి ఆఫర్‌ను కస్టమర్‌లకు ఇచ్చింది.
‘ఐస్‌క్రీమ్ డే’ను పురస్కరించుకొని బెంగళూరుకు చెందిన ‘కార్నర్ హౌజ్ ఐస్‌క్రీమ్స్’ అనే ఐస్‌క్రీమ్ కంపెనీ షాప్ ముందు నుంచి కౌంటర్ వరకు డ్యాన్స్ చేస్తూ వచ్చే వాళ్లకు ఫ్రీ ఐస్‌క్రీమ్ ఆఫర్ ఇచ్చింది. ఇక డ్యాన్సులే డ్యాన్సులు!
కంపెనీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ డ్యాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. ‘ఫ్రీ ఐస్‌క్రీమ్ మాటేమిటోగానీ ఎంతోమంది డ్యాన్సింగ్ స్కిల్స్‌ను చూసే అవకాశం వచ్చింది’
‘డ్యాన్స్ చేస్తే ఫ్రీగా టమాటాల ఆఫర్ ఎవరైనా ఇస్తే బాగుండేది’... ఇలాంటి కామెంట్స్ నెటిజనుల నుంచి వచ్చాయి.