
ఇంటిప్స్
వెల్లుల్లి రెబ్బల పొట్టు తీయడం చాలా మందికి ఇబ్బందిగానే ఉంటుంది. వెడల్పాటి రెండు సెరామిక్ బౌల్స్ తీసుకొని, ఒకదాంట్లో వెల్లుల్లి రెబ్బలను వేసి, మరో బౌల్‌ను వాటి మీద గట్టిగా అటూ ఇటూ అదిమితే.. త్వరగా పొట్టు వచ్చేస్తుంది. బటర్‌ను తురుముతుంటే గుజ్జుగా అయిపోయి ప్లేట్‌కు అతుక్కుపోతుంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా మైదా పైన చల్లితే కొబ్బరి తురుములా వస్తుంది.
కావల్సినంత ఐస్‌క్రీమ్ తీసుకున్నాక డబ్బాను డీప్‌ఫ్రిజ్‌లో పెట్టేస్తారు. దీంతో అది అడుగుభాగాన గడ్డకట్టిపోయి, తిరిగి తీయడానికి కష్టమవుతుంది. ప్లాస్టిక్ జిప్‌లాక్ కవర్‌లో ఐస్‌క్రీమ్‌ను డబ్బాను ఉంచి, ఫ్రిజ్‌లో పెట్టేస్తే తిరిగి తీసుకోవడం సులువు అవుతుంది.