మందుబాబుల ఐస్‌క్రీమ్ | Ice Cream of drunkers | Sakshi
Sakshi News home page

మందుబాబుల ఐస్‌క్రీమ్

Published Wed, Jun 8 2016 3:38 AM | Last Updated on Mon, Sep 4 2017 1:55 AM

మందుబాబుల ఐస్‌క్రీమ్

మందుబాబుల ఐస్‌క్రీమ్

మందుబాబులం మేము మందుబాబులం...మందు కొడితె మాకు మేమే మహారాజులం’..అంటూ రాత్రిపూట ఫుల్‌గా తాగేసే మందుబాబులు..

దక్షిణ కొరియా: ‘మందుబాబులం మేము మందుబాబులం...మందు కొడితె మాకు మేమే మహారాజులం’..అంటూ రాత్రిపూట ఫుల్‌గా తాగేసే మందుబాబులు.. తెల్లవారేసరికి హ్యాంగోవర్‌తో బాధపడుతుంటారు. వెంటనే ఆ ‘కిక్’ పోగొట్టే మందు ఉంటే బాగున్ను అని చాలా మంది మద్యప్రియులు అనుకుంటుంటారు. సరిగ్గా అలాంటివారి కోసమే దక్షిణ కొరియాకు చెందిన కంపెనీ ఓ ఐస్‌క్రీమ్‌ను తయారుచేసింది.

‘ట్రీ ఫ్రూట్ జ్యూస్’ అనే ఈ గ్రేప్ ఫ్లేవర్డ్ ఐస్‌క్రీమ్‌ను తింటే చాలు.. క్షణాల్లో హ్యాంగోవర్ మటుమాయమైపోతుంది. ఆసియాలోనే ఎక్కువగా ఆల్కహాల్ సేవించే దేశం దక్షిణ కొరియాలో ఈ ఐస్‌క్రీమ్ ఎక్కువగా అమ్ముడుపోతుంది. త్వరలో ఇది భారత్‌లో అందుబాటులోకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement