
ఉచితంగా ఇస్తామంటే ఏ పని చేయడానికి వెనకాడరు కదా!. అందులోకి ఫుడ్‌కి సంబంధిచింది అంటే ఇంక జనాలు ఎలా ఎగబడతారో చెప్పనవసరం లేదు. అందుకు పెద్ద చిన్నా అనే తేడా లేదు. అలాంటి ఘటనే బెంగళూరు చోటు చేసుకుంది. ఓ ఐస్‌క్రీం ఫాపు వాళ్లు డ్యాన్స్ చేస్తే ఐస్‌క్రీం ఫ్రీ అని ఆఫర్ ఇచ్చింది. అంతే ఇక..ఆ ఉచిత ఐస్‌క్రీంల కోసం వృద్ధులు యువత అనే తేడా లేకుండా పోటాపోటీగా డ్యాన్సుల చేసి మరీ ఐస్‌క్రీంని ఆరగించి వెళ్తున్నారు. మాములుగా ఏదైన ఈవెంట్ పరంగా చేయాల్సి వస్తే డ్యాన్స్ చేసేందుకు ఎవరూ ముందుకు రారు.
ఇలాంటప్పుడూ మాత్రం డ్యాన్స్‌లు వచ్చినా రాకపోయినా రెండు స్టెప్‌లు ఏదోరకంగా వేసి మరీ తమ తడాఖా ఏంటో చూపిస్తారు. ఇలాంటి విచిత్రమైన ఆఫర్లు ఉంటే జనాల్లో దాగున్న అన్ని టాలెంట్లు బయటకు వచ్చేస్తాయి కూడా. అయితే ఎందుకిలా బెంగళూరుషాపు వాళ్లు ఈ ఆఫర్ పెట్టారంటే..ఐస్‌క్రీం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. ఔనా! అయితే ప్రతి జూలై మూడోవ ఆదివారం ప్రపంచవ్యాప్తంగా నేషనల్ ఐస్‌క్రీం డేని జరుపుకుంటారు.
ఈ ఏడాది అదికాస్త జూలై 16న వచ్చింది. ఆ సందర్భంగా బెంగళూరులోని ప్రఖ్యాతిగాంచిన ఓ ఐస్‌క్రీం షాపు ఏదైన వినూత్న రీతిలో కస్టమర్లకు ఐస్‌క్రీంని సర్వ్ చేయాలనుకుంది. అందులో భాగంగా ఇలాంటి వైరైటీ ఆఫర్ ఇచ్చింది కస్టమర్లకు. ఆ షాపు వాళ్లు కస్టమర్లు అదిరిపోయే డ్యాన్స్‌లు చేస్తే ఐసీక్రీం ఫ్రీ అని బోర్డు పెట్టింది. అంతే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా జనాలు ఇలా ఉత్సాహంగా ముందుకు వచ్చి తమ టాలెంట్‌ని చూపించారు. ఈ మేరకు సదరు ఐస్‌క్రీం షాపు అందుకు సంబందించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో నెటిజన్లతో పంచుకుంది. ఈ వేడుక మీ ప్రేమతో దిగ్విజయం జరిగింది అందుకు మా కస్టమర్లకు ధన్యావాదాలు అని ఇన్‌స్టాలో పేర్కొంది సదరు ఐస్‌క్రీం షాపు యాజమాన్యం.
Comments
Please login to add a commentAdd a comment