![little child is a big mind - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/21/Chettu-Needa-LOGO.jpg.webp?itok=4yAJqe2g)
పిల్లాడు తన దగ్గరున్న చిల్లర నాణేలనిజేబులోంచి తీసి లెక్కించసాగాడు. వెయిట్రెస్ అసహనంగా ఫీలైంది. పిల్లాడు మెనూలోమరో ఫొటో వైపు చూపిస్తూ, ‘మరి ఈ బటర్ స్కాచ్ ఎంత?’ అన్నాడు.
ఒక వేసవికాలం మధ్యాహ్నం. ఒక పదేళ్ల పిల్లాడు ఐస్‌క్రీమ్ పార్లర్‌కు వెళ్లాడు. ఎగిరి కూర్చున్నట్టుగా కుర్చీలో కూర్చున్నాడు. పెద్దవాళ్లు ఎవరూ వెంటలేని చిన్న పిల్లాడి దగ్గరికి వచ్చింది ఒక వెయిట్రెస్. గ్లాసు మంచినీళ్లు ముందుపెట్టి, ‘ఏం కావా’లని అడిగింది.టేబుల్ మీదున్న మెనూలోంచి ఒక ఫొటో చూపిస్తూ, ‘ఈ కస్టర్డ్ ఆపిల్ ఐస్‌క్రీమ్ ఎంత?’ అని అడిగాడు పిల్లాడు.‘యాభై రూపాయలు’ బదులిచ్చింది.పిల్లాడు తన దగ్గరున్న చిల్లర నాణేలని జేబులోంచి తీసి లెక్కించసాగాడు. వెయిట్రెస్ అసహనంగా ఫీలైంది.పిల్లాడు మెనూలో మరో ఫొటో వైపు చూపిస్తూ, ‘మరి ఈ బటర్ స్కాచ్ ఎంత?’ అన్నాడు.
ఇంతలో పార్లర్‌కు వేరే కస్టమర్లు రావడంతో ఆమె త్వరగా కానిమ్మన్నట్టుగా జవాబు ఇస్తూ, ‘నలభై రూపాయలు’ అంది.పిల్లాడు మళ్లీ నాణేలు లెక్కించసాగాడు. వెయిట్రెస్ ఓపిక నశిస్తోంది. చివరకు తేల్చుకున్నట్టుగా, ‘బటర్ స్కాచ్’ అన్నాడు. ఆమె వేగంగా ఐస్‌క్రీమ్ తెచ్చి, బిల్లు కూడా టేబుల్ మీద పెట్టి, ఇతర కస్టమర్లకు ఏం కావాలో చూడటానికి వెళ్లింది. కాసేపయ్యాక తిరిగి వచ్చేసరికి పిల్లాడు టేబుల్ మీద లేడు. డబ్బు కౌంటర్లో కట్టేసి వెళ్లిపోయాడు. టేబుల్ మీద టిప్పుగా పెట్టిన పది రూపాయి బిళ్లలు చూసేసరికి ఆమెకు కన్నీళ్లు ఆగలేదు.
Comments
Please login to add a commentAdd a comment