
ఐస్క్రీమ్.. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అమితంగా ఇష్టపడే ఆహారం. ముఖ్యంగా వేసవి వచ్చిందంటే అర్ధరాత్రి వరకూ ఐ్రస్కీమ్ పార్లర్ చుట్టూ చెక్కర్లు కొడతారు హైదరాబాద్ నగర వాసులు. దీనికితోడు భాగ్యనగరం వేదికగా విభిన్న స్టోర్స్‌లో వినూత్న ఫ్లేవర్లలో ఐస్క్రీమ్స్ అందుబాటులో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగర వేదికగా వినూత్నంగా ఒక రూపాయికే ఒక గ్రాము ఐ్రస్కీమ్ అంటూ ఐస్‌బర్గ్ ఆర్గానిక్ ఐస్క్రీమ్స్ సందడి చేస్తోంది. ఇవి పూర్తిగా ఆర్గానిక్ ఉత్పత్తులు కావడం మరో విశేషం.
గోంధ్ గమ్, గ్వార్ గమ్ వెరైటీలు..
దేశంలోనే మొట్టమొదటి ఏకైక ఆర్గానిక్ క్రీమరీ అయిన ఐస్‌బర్గ్ ఆర్గానిక్ ఐస్క్రీమ్స్ హైదరాబాద్‌లో తన సేవలను విస్తరిస్తోంది. ఇందులో భాగంగా బేగంపేటలో నూతన ఔట్‌లెట్‌ను ప్రారంభించింది. పూర్తిగా ఆర్గానిక్ విధానంలో ఐస్క్రీమ్‌ను అందించే ఈ బ్రాండ్ ఏ2 దేశీ ఆవుపాలు, ఆర్గానిక్ యెల్లో బటర్‌తో పాటు సహజ సిద్ధమైన తీపి పదార్థాలైన ధాగా మిశ్రీ, కోకోనట్ షుగర్, బెల్లం వంటి వాటితో రుచికరమైన మనసుదోచే ట్రీట్ అందిస్తోంది.
వినూత్నంగా గోంధ్ గమ్, గ్వార్ గమ్‌తో పేటెంట్ పొందిన ప్రిజర్వేటివ్–రహిత ఫార్ములాతో ఐస్ బర్గ్ సరికొత్త పదార్థాలను నగర వాసులకు పరిచయం చేసింది. ప్రీమియం నట్స్, డీహైడ్రేటెడ్ ఫ్రూట్స్, ఆర్గానిక్ సిరప్‌లతో 40కి పైగా ఆర్గానిక్ టాపింగ్స్‌తో కస్టమర్లకు మధురానుభూతిని అందిస్తోంది. ఔట్ లెట్‌లో డెత్ బై చాక్లెట్ సండేస్, ఆర్టిసానల్ ఐస్క్రీం కేక్స్ వంటి సిగ్నేచర్ ఆఫర్లు మాదాపూర్, బేగంపేట, కేపీహెచ్‌బీలో హైదరాబాదీలను ఆకట్టుకుంటున్నాయి.
వంద మందికి పైగా సేంద్రీయ రైతులతో ఐస్‌బర్గ్ భాగస్వామి అయ్యింది. బేగంపేటలో గురువారం నిర్వహించిన ప్రారంభోత్సవంలో సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మరో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
(చదవండి: అంతా.. ఫ్యాన్సీ ఫ్యాన్సే..! ఏంటీ ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్..)