
పుర్రెకోబుద్ధి జిహ్వకోరుచి అంటారు పెద్దోళ్లు. అంటే ప్రతి మనిషి ఆలోచనలు వేరుగా ఉంటాయి, అభిరుచులు భిన్నంగా ఉంటాయి అని దాని అర్థం. అలాగే ఒక్కొక్కరు ఒక్కోరకమైన టేస్ట్‌ను ఇష్టపడుతుంటారు. ఇప్పుడు ఓవైస్ సిద్ధ్‌క్వి అనే వ్యక్తి తన అభిరుచికి తగ్గట్టు ఒక స్పెషల్ డిష్‌ను తయారుచేసి దానిని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దానిని చూసివారు వారి అభిప్రాయాలను బట్టి భిన్నంగా స్పందిస్తున్నారు. ఇంతకీ అతను చేసిన డిష్ ఏంటంటే... మనలో చాలా మందికి ఛాయ్ తాగనిదే తెల్లారదు. టీని ఇష్టపడని వారు సామాన్యంగానే ఎవరు ఉండరు అని చెప్పొచ్చు.
Chai paratha reimagined, spiced doodh patti ice cream with sugar laced parhatta. pic.twitter.com/CzPORPMb0U
— Owais Siddiqui (@OwaisO) October 8, 2020
అందుకే టీ అంటే చాలా ఇష్టపడే సిద్ధ్‌క్వి ఛాయ్ పరాఠ తయారు చేసి దానిలో తనకు ఇష్టమైన ఐస్‌క్రీమ్‌ను వేసి ఒక ఢిపరెంట్ డిష్‌ను తయారు చేశారు. చాలా మంది ఛాయ్‌తో పాటు సమోసకానీ, బిస్కెట్లు కానీ తినడానికి ఇష్టపడతారు. ఇక మన సిద్ధ్‌క్వి మాత్రం తనకు ఇష్టమైన టీని పరాఠ తయారీలో ఉపయోగించి దానిలో అతనికి ఎంతో ఇష్టమైన ఐస్‌క్రీమ్ పెట్టి ఒక డిఫరెంట్ టేస్ట్‌ను నెటిజన్ల ముందు ఉంచాడు. ఇక చాలా మంది నెటిజన్లు నిజంగా ఇది సూపర్బ్ కాంబినేషన్ అంటూ కితాబిస్తున్నారు.