
ఐస్‌క్రీం పార్లర్లలో వ్యభిచారం
చెన్నై: ఐస్‌క్రీం పార్లర్లలో రహస్యంగా నిర్వహిస్తోన్న వ్యభిచార గృహాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. నాగర్‌కోవిల్ సహా కన్యాకుమారి జిల్లాలో అనేక ఐస్‌క్రీం పార్లర్‌లు వున్నాయి. వీటిల్లో కొన్ని ప్రత్యేక గదుల్లో యువ జంటల రాసలీలలకు వీలు కల్పిస్తున్నారు. ఈ ఘటనలపై అనేకమార్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వీటికి ముఖ్యంగా పాఠశాల, కళాశాలలకు చెందిన యువత వస్తున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా ఐస్‌క్రీం పార్లర్లపై పోలీసులు దాడులు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఒక ఐస్‌క్రీం పార్లర్‌పై దాడి జరిపిన ఘటనలో ఒక యువజంట పోలీసులకు చిక్కింది. అనంతరం పార్లర్ యజమానిని పోలీసులు విచారణ జరిపారు. కాగా అరెస్టయిన వ్యక్తిని అన్నాడీఎంకేలోని ఒక నేత సిఫార్సుతో పోలీసులు వదిలిపెట్టారు.