
వ్యభిచార నిర్వాహకులు పద్మ, యల్లారెడ్డి
విశాఖ క్రైం: నగరంలోని నాలుగో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని దొండపర్తి సీరపువారి వీధిలో వ్యభిచారం నిర్వహిస్తున్న కొందరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీరపువారి వీధిలో ఉంటున్న పి.పద్మ, పి.యల్లారెడ్డి కొద్దిరోజులుగా తమ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో మంగళవారం సాయంత్రం ఆ ఇంటిపై ఏసీపీ చిట్టిబాబు ఆధ్వర్యలో దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు విటులతో పాటు కలకత్తాకు చెందిన ఓ యువతిని, నిర్వాహకులను అందుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. వీరి వద్ద నుంచి 4 సెల్‌ఫోన్లు, రూ.11400 నగదు స్వాధీనం చేసుకుని నాలుగో పట్టణ పోలీసుస్టేషన్‌కు అప్పగించినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment